మెంతికూరను వాడుతున్నారా.? అయితే మగవారికి ఈ సమస్య తప్పినట్లే..!

-

ఆకు కూరల అన్నింటిలో ఆడవారికి ఎక్కువ పనిపెట్టేది మెంతికూర. గిల్లలేక చాలామంది ఇది వండుకోవడం కూడా మానేస్తారు. మనకేమో.. ఏదైనా ఫాస్ట్ గా అయిపోవాలి. కానీ కాస్త టైం ఎక్కువ తీసుకున్నప్పటికీ.. కాళీ టైంలో ఏ సిరయల్స్, సినిమానో చూసుకుంటూ.. మెంతికూరను గిల్లి ఫ్రిడ్జ్ లో పెట్టుకుని వాడుకుంటే.. ఎంతో మంచిది. మనం ఈరోజు.. మెంతికూర వల్ల ఎలాంటి పోషకాలు, తినటం వల్ల ఆరోగ్యానికి ఏ విధంగా మేలు జరుగుతుందో చూద్దాం.
మెంతికూర మీద 1986లో తార్నాక హైదరబాద్ NIN ( National Institute of Nutrition) వారు పరిశోధన చేశారు. ఆ అధ్యయనం ప్రకారం.. మెంతికూరలో ఎలాంటి పోషకాలు ఉన్నాయంటే..
100 గ్రాములు మెంతికూరలో ఉండే పోషకాలు
87 గ్రాములు నీటిశాతం
శక్తి 34 కాలరీలు
కార్భోహైడ్రేట్స్ 2 గ్రాములు
ప్రొటీన్ 4 గ్రాములు
ఫ్యాట్ 1 గ్రాము
ఫైబర్ 5 గ్రాములు

మెంతికూర వల్ల ఆరోగ్యానికి ఏవిధంగా మేలు జరుగుతుందంటే..

ఈ కూరలో ఐరన్ 6 మిల్లీగ్రాములు ఉంటుంది. రక్తహీనత రాకుండా బాగా రక్షించడానకి ఉపయోగపడుతుందని సైంటిస్టులు పేర్కొన్నారు. విటమిన్ k1 428 మైక్రో గ్రాములు ఉంది. ఇది కాల్షియంను, ఫాస్పరస్ ను ఎముకలు బాగా గ్రహించుకునేట్లు చేస్తుంది. మనం కాల్షియం, ఫాస్పరస్ తీసుకున్న ఒక్కోసారి బాడీకి పట్టదు. మోషన్ రూపంలో వెళ్లిపోతుంది. ఎముకలు బాగా పట్టాలంటే.. విటమిన్ k1 బాగా ఉండాలి. మెంతికూర ఎముకలు బాగా మేలుచేస్తుంది. ఎముకలు గుల్లబారకుండా కాపాడుతుంది.
ఇక టైప్ 2 డయబెటీస్ రాకుండా కంట్రోల్ చేస్తుంది. వచ్చిన వారికి కంట్రోల్ లో ఉంచుతుంది. మెంతికూరలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను బాగా తగ్గిస్తుంది.. తద్వారా రక్తంలో చెక్కరె స్థాయిలు పెరగకుండా నిరోధిస్తుందని అధ్యయనంలో పేర్కొన్నారు.
మగవాళ్లకు ఉపయోగపడే ముఖ్యమైన విషయం.. ఒబిసిటీ ఎక్కువ అవడం వల్ల మగవారిలో (SHPG) సెక్స్ హార్మోన్.. ఇది ఏం చేస్తుందంటే.. మగవారిలో ఉండే టెస్టోస్టిరోన్ ను తగ్గించే.. ఫిమేల్ హార్మోన్ లా మార్చేస్తుంది. మెంతికూర మగవారిలో అధికంగా రిలీజ్ అయ్యే SHPG ను తగ్గించి టెస్టోస్టిరోన్ లెవల్ ను దెబ్బతినకుండా పెంచేట్లు చేస్తుంది. టెస్టోస్టిరోన్ పెరగడం వల్ల మగవారిలో స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. మెయిల్ ఫర్టిలిటీకి మెంతికూర ఈ విధంగా ఉపయోగపడుతుంది.

ఇక బాలింతలకు మెంతికూర వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది.

ఇన్ని రకలా ఫలితాలు ఉన్నాయి అని సైంటిఫిక్ గా నిరూపించారు. శ్రమ అనుకోకుండా మెంతికూరను వాడుకోవడం మంచిది. మరి వండుకునే విధానం వల్ల కొన్నిసార్లు పోషకాలు పోతాయి. ఎలా మెంతికూరన వండుకోవాలంటే..
సాధరణంగా.. ఆకుకూరలను కట్ చేసి ముందు పెట్టుకోకూడదు. వండేముందే కట్ చేయాలి. కానీ మెంతికూరను ముందే గిల్లి పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ మెంతికూర కాడమాత్రమే గిల్లుతున్నాం.. కట్ చేయడం లేదు. ఇక ఈ గిల్లిన మెంతికూరను పుల్కాలు చేసుకునేప్పుడు.. పిండికి రెండితలు మెంతికూర తీసుకుని కలుపుకోండి. ఎలాగో పుల్కాలు ఎక్కువసేపు వేడిచేయం. మెంతికూరలో పోషకాలు పోవు, పచ్చిగా ఉండదు.
మెంతికూరతో కట్ లెట్స్ కూడా చేసుకోవచ్చు. ఎందులో మెంతికూర వేసుకున్నా.. ఉప్పు వాడక్కర్లేదు. అయితే.. ఏం చేసినా.. ఎక్కువ ఫ్రే లేకుండా చూసుకోవాలి. మెంతికూరను 5 నిమిషాలు వేడిచేస్తే చాలు. అలా ప్లాన్ చేసుకుని వంటల్లో ఈ కూరను వాడితే.. మంచి పోషకాలు బాడీకి అందుతాయి.
– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news