ఈనెల 4న రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ల భేటీ

-

కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పై నజర్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో గెలవాలనే వ్యూహంతో కాంగ్రెస్ ఉంది. అందుకు తగ్గట్లుగానే వరసగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశం అవుతున్నారు. ఇప్పటికే తెలంగాణ పీపీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మానిక్కం ఠాగూర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీ, బలరాం నాయక్, వేణుగోపాల్, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మల్లు రవి తదితరులు 14 మంది భేటీ అయ్యారు. rahul gandhi

తాజాగా మరోసారి తెలంగాన కాంగ్రెస్ సీనియర్ నేతలతో రాహుల్ గాంధీ ఈనెల 4న సమావేశం కాబోతున్నారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయాలపై చర్చ జరగనుంది. దీంతో పాటు పార్టీలో అసంత్రుప్తుల గురించి అధిష్టానానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి తెలియజేసే అవకాశం ఉంది.

గత కొన్ని రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అధిష్టానం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసేందుకు వెళ్లిన కొంతమంది సీనియర్లకు అధినేతల అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఒకింత అసహనంతో ఉన్నారు. ఈనేపథ్యంలో తెలంగాణ సీనియర్లలో మళ్లీ ఆశలు నింపేందుకు, కొంత ఉత్సాహంతో పనిచేసేందుకు రాహుల్ గాంధీతో భేటీ ఉపయోగపడుతుందని కాంగ్రెస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news