మహేష్ ఫ్యాన్స్ కు పండగే.. సర్కార్ వారి పాట నుంచి పోస్టర్ రిలీజ్

-

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ‘సర్కార్ వారి పాట’ ను బిగ్ అప్డెట్ వచ్చింది. సినిమా నుంచి మహేష్ బాబు పోస్టర్ రిలీజ్ చేసింది. ఉగాది పండగను పురస్కరించుకుని సినిమా యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ‘ కళావతి’, ‘ పెన్నీ’ సాంగ్స్ ఊపేస్తున్నాయి. కళావతి సాంగ్ రికార్డ్ వ్యూస్ దక్కించుకుంటోంది. తాజాగా విడుదలైన మహేష్ బాబు మాస్ లుక్కులో ఉన్న ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ చూస్తే ఇక మహేష్ అభిమానులకు పండగే.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు పరుశురామ్ డైరెక్షన్ వహిస్తున్నాడు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే కళావతి సాంగ్ తో థమన్ తన ట్యూన్ తో మెస్మరైస్ చేశాడు. ఇక సిడ్ శ్రీరామ్ తన గాత్రంలో సాంగ్ ను సూపర్ హిట్ చేశారు. సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత దాదాపు ఏడాదిన్నర లాంగ్ గ్యాప్ తరువాత ఈ ఏడాది మే 12న ‘ సర్కార్ వారి పాట’ విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news