కోతికి పిల్లాడు దొరికాడు.. ఆ పిల్లాడిని ఏం చేయబోయిందో తెలుసా?

కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఏం చేస్తుంది. లటక్కున తినేస్తుంది. అదే కోతికి పిల్లాడు దొరికితే ఇంకేమన్నా ఉందా. కోతి అంటేనే విచిత్ర చేష్టలు చేసే జీవి. అందుకే కోతి చేతిలో చిక్కిన ఆ బాలుడిని రక్షించడానికి అక్కడి వాళ్లు చాలా కష్టపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన చర్చనీయాంశమైంది.

కర్నాటకలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుండగా.. ఓ కోతి చిన్న పిల్లాడి దగ్గరికి వెళ్లి అతడిని ఎత్తుకెళ్లబోయింది. దాని చేష్టలను గమనించిన స్థానికులు దాని బారి నుంచి పిల్లాడిని తప్పించడానికి తెగ ప్రయత్నించారు. కాని.. అది అరుస్తూ అందరి మీద ఎగబడింది. దానికి ఆహారం ఎర చూపినా పిల్లాడిని వదలలేదు. ఆ పిల్లాడిని ఏమైనా చేస్తుందేమోనని అంతా భయపడ్డారు. కాని.. చివరకు దాని బారి నుంచి పిల్లాడిని కాపాడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇక.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.