చైనాలో 20 కోట్లకు పైగా యువతీ యువకులు పెళ్లి కాకుండా సింగిల్ ఉంటూ అవస్థలు పడుతున్నారట. అందుకని వారికి జీవిత భాగస్వాములను ఎంపిక చేసేందుకు చైనా ప్రభుత్వం నడుం బిగించింది.
ఏళ్లు గడుస్తున్నా తమకు నచ్చిన జీవిత భాగస్వామి దొరకక అవస్థలు పడే యువత నేటి తరుణంలో చాలా మందే ఉన్నారు. యువకులు.. యువతులు ఎవరైనా కావచ్చు.. పెళ్లి కాకుండా అలాగే ఉండి.. రోజు రోజుకీ బెండకాయలా ముదిరిపోతుంటే అలాంటి వారికి ఉండే యాతన అంతా ఇంతా కాదు. ఇక తమకు ఎప్పటికీ పెళ్లి కాదేమోనని చెప్పి వారు ఆందోళన చెందుతుంటారు. అయితే కేవలం మన దేశంలోనే కాదు చైనాలోనూ ఇప్పుడీ సమస్య ఎక్కువగా ఉందట. అందుకు గాను ఆ దేశ ప్రభుత్వం ఎవరూ చేయని ఓ వినూత్న ఆలోచన చేసింది.. అదేమిటంటే…
చైనాలో 20 కోట్లకు పైగా యువతీ యువకులు పెళ్లి కాకుండా సింగిల్ ఉంటూ అవస్థలు పడుతున్నారట. అందుకని వారికి జీవిత భాగస్వాములను ఎంపిక చేసేందుకు చైనా ప్రభుత్వం నడుం బిగించింది. అందులో భాగంగానే 3 ఏళ్ల కిందట వై999 పేరిట లవ్ పర్‌ష్యూట్ అనే ఓ ట్రెయిన్‌ను ప్రారంభించారు. అయితే ఇంతకీ అక్కడి యువతీ యువకుల పెళ్లిళ్లకు, ఆ ట్రెయిన్‌కు సంబంధం ఏమిటా.. అని ఆలోచిస్తున్నారా.. ఏమీ లేదండీ.. ఆ ట్రెయిన్ పెళ్లి కాని యువతీ యువకులకు సంబంధాలు చూసి పెడుతుంది.
లవ్ పర్‌ష్యూట్ ట్రెయిన్ లో కేవలం పెళ్లికాని యువతీ యువకులకు మాత్రమే ఎక్కేందుకు చాన్స్ ఉంటుంది. ఈ క్రమంలో ఆ ట్రెయిన్ 2 రోజుల పాటు పలు స్టేషన్ల మధ్య తిరుగుతుంది. అయితే ఆ జర్నీలో ట్రెయిన్‌లో ఉన్న యువతీ యువకులు తమకు నచ్చిన వారిని ఎంపిక చేసుకుని వారిని ప్రేమించవచ్చు. నచ్చితే జీవిత భాగస్వామిని కూడా చేసుకోవచ్చు. దీంతో కొంత వరకైనా ఆ సమస్య తగ్గుతుందని చైనా ప్రభుత్వం ఆలోచించింది. అందులో భాగంగానే ఈ ఏడాది ఆగస్టు 10న చాంగ్‌కింగ్ అనే స్టేషన్ నుంచి కియాన్‌జియాంగ్ అనే స్టేషన్ మధ్య ఆ ట్రెయిన్‌ను నడిపారు. అందులో చాలా మంది యువతీ యువకులు ఎక్కి జర్నీ చేశారు. అయితే ఈ ట్రెయిన్ ఇప్పటికి 3 ఏళ్లలో కేవలం 3 ట్రిప్పులు మాత్రమే వేసింది. అయినప్పటికీ ఈ ట్రెయిన్ వల్ల యువతీ యువకులకు మేలు జరుగుతుందని, కొందరు ట్రెయిన్‌లో పరిచయమై ప్రేమించి పెళ్లిళ్లు కూడా చేసుకున్నారని, చాలా మందికి కొత్త స్నేహితులు కూడా ఏర్పడుతున్నారని చైనా ప్రభుత్వం చెబుతోంది. ఇక ఆ ట్రెయిన్‌ను లవ్ ట్రెయిన్ అని కూడా పిలుస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఐడియా భలే వింతగా ఉంది కదా..!