ఐదు కిడ్నీలున్న ఈ వ్యక్తి మీకు తెలుసా?.. ప్రజెంట్ ఆయన హెల్త్ ఎలా ఉందంటే?

-

సాధారణంగా ఓ వ్యక్తికి రెండు కిడ్నీలు ( Kidney ) మాత్రమే ఉంటాయని అందరికీ తెలుసు. కానీ, మనం ఇప్పుడు తెలుసుకోబోయే ఈ వ్యక్తికి ఐదు కిడ్నీలున్నాయట. ఇంతకీ ఆయనకు ఫైవ్ కిడ్నీస్ ఎలా వచ్చాయి? ఆ వ్యక్తి ప్రస్తుతం ఎలా ఉన్నాడు? ఏ ప్రాంతానికి చెందిన వారు ఆయన? అనే వివరాలు తెలియాలంటే మీరు ఈ స్టోరీని పూర్తిగా చదవాల్సిందే.

kidney | కిడ్నీలు
kidney | కిడ్నీలు

ఐదు కిడ్నీలున్న వ్యక్తికి సంబంధించిన ఈ అరుదైన కేసు చెన్నైలోని ఓ ఆస్పత్రి ద్వారా వెలుగులోకి వచ్చింది. సదరు పేషెంట్‌కు ఐదు కిడ్నీలుండట విశేషం కాగా ప్రస్తుతం ఆయన హెల్త్ కండిషన్ సరిగా లేదు. ఈ క్రమంలోనే వైద్యులు అతడికి ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. అతడికి ఐదు కిడ్నీలు ఎలా వచ్చాయంటే.. 1994లో సదరు వ్యక్తికి రెండు కిడ్నీలు చెడిపోగా, అతడి వయస్సు అప్పుడు పద్నాలుగుఏళ్లు మాత్రమే. ఈ క్రమంలో కిడ్నీట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ చేశారు డాక్టర్స్. అలా అమర్చిన కిడ్నీలు తొమ్మిదేళ్ల పాటు పని చేయగా, అవి కూడా చెడిపోవడంతో 2005లో మరో కిడ్నీని అమర్చారు. అది అమర్చిన క్రమంలో 12 ఏళ్లు బాగానే పని చేసింది. దీంతో అంతా బాగుందనుకున్నారు. కానీ, ఆ కిడ్నీ కూడా చెడిపోయింది. దాని పనితీరు అస్సలు మెరుగుపడలేదు.

దీంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఈ క్రమంలోనే సదరు పేషెంట్ వయసు కూడా పెరుగుతూ వచ్చింది. ప్రజెంట్ సదరు పేషెంట్ ఏజ్ 41 ఇయర్స్. ఇకపోతే నాలుగో కిడ్నీ పెట్టిన ఏడెనిమిదేళ్ల వరకు అది బాగానే పని చేసినా తర్వాత దాని పనితీరు క్రమంగా క్షీణించింది. దీంతో పూర్తిగా డయాలసిస్‌కే పరిమితం కావాల్సి వచ్చింది సదరు పేషెంట్. ఇక ఆ తర్వాత ఐదో కిడ్నీ అమర్చుకున్నా.. వన్ వీక్‌కు త్రీ టైమ్స్ డయాలిసిస్ చేయించుకోవాల్సి వచ్చింది. ఇలా ఐదు కిడ్నీలు ఉన్న అరుదైన వ్యక్తిగా సదరు పేషెంట్ రికార్డుకెక్కగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.

కొత్తగా ఏర్పాటు చేసిన ఐదో కిడ్నీకి రక్త ప్రసరణ ఏర్పాటు చేసేందుకు డాక్టర్స్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఐదో కిడ్నీని పేషెంట్ పేగులకు సమీపంలో అమర్చారు. డాక్టర్స్ పేషెంట్‌కు క్లిష్టమైన సర్జరీ చేయగా, ప్రజెంట్ డాక్టర్స్ పర్యవేక్షణలో పేషెంట్ ఉన్నారు. మరికొద్ది రోజులు గడిస్తే కానీ పేషెంట్ ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలుస్తుందని డాక్టర్స్ చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news