మనకు తెలిసి చిన్న చిన్న జీవులు అయితే ఎక్కువ పిల్లలు కంటూ ఉంటాయి. కానీ కొంచెం పెద్ద జీవులు అయితే మహా అయితే ఒకేసారి రెండు పిల్లల్ని మాత్రమే కంటాయి. కానీ ఏనుగు లాంటి పెద్ద జంతువు అయితే ఒక్క పిల్లను కనడమే మహా అద్భుతం. కానీ ఇప్పుడు అంతకు మించి వండర్ జరిగింది. అదేంటంటే ఒకేసారి ఒక ఏనుగు రెండు పిల్లలను కనడం ఇప్పుడు పెద్ద వార్త అయిపోయింది. అయితే ఇది జరిగింది మాత్రం మన దేశంలో కాదండోయ్. మన పక్కనున్న శ్రీలంక దేశంలో. ఇప్పుడు ఈ వార్త అక్కడ వైరల్ అవుతోంది.
ఈ దేశంలోని ఒక 25 ఏళ్ళ సురంజి అనే ఆడ ఏనుగు ఇప్పడు వార్తల్లో నిలుస్తోంది. ఎందుకంటే దీనికి ఒకేసారి రెండు మగ కవలలకు జన్మనిచ్చింది. అయితే ఈ ఏనుగు ఏనుగుల అనాథ ఆశ్రమంలో పెరుగుతుండగా మంగళవారం రోజు ఒకేసారి దీనికి రెండు మ ఏనుగు పిల్లలు జన్మించడం ఇప్పుడు సంచలనంగా మారిపోయింది. అయితే ఇప్పుడు దీని ఆరోగ్యం బాగానే ఉందని ఇది ఉంటున్న పిన్నవాలా ఏనుగుల అనాథ ఆశ్రమ నిర్వహకులు వివరించారు.
కాగా ఇదే దేశంలో సరిగ్గా ఎనభై ఏండ్ల క్రితం అనగా 1941లో తొలిసారిగా ఒక ఆడ ఏనుగు ఈ విధంగా కవలపిల్లలకు జన్మనిచ్చిందని మళ్లీ ఇప్పుడు ఇలా జరిగిందని ఈ అద్భుతం ఇప్పడు చోటుచేసుకుందని ఏనుగుల నిపుణుడు జయంత జయవర్దనే వివరించారు. ఈ సురంజి అనే ఏనుగు 2009లో ఒక మగ ఏనుగును కన్నదని, మళ్లీ ఇన్నేండ్లకు ఇలా మగ ఏనుగు పిల్లలను కనడం చాలా సంతోషంగా ఉందని వారు తెలిపారు. కాగా గాయపడిన లేదంటే ఆరోగ్యం క్షీణించిన వాటిని అనాథ ఆశ్రమంలో ఇలా పెంచుతారని తెలుస్తోంది.