హుజూరాబాద్.. హుజూరాబాద్.. హుజూరాబాద్.. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు ఇదే పేరు మార్మోగిపోతోంది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న ఉప ఎన్నిక ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు తీసుకోవడంతో అందరి దృష్టి ఇప్పుడు ఇక్కడే ఉంది. ఇంకా ఎప్పాలంటే రాజకీయాలను మలుపు తిప్పే ఎన్నికగా ఇప్పడు హుజూరాబాద్ నిలుస్తోంది. ఇక్కడ గెలిచేందుకు బీజేపీ ఎప్పటి నుంచో ముందు వరుసలో ప్రచారం చేస్తోంది. ఇంకోవైపు టీఆర్ఎస్ ఎలాగైనా గెలిచిన తన పంతం నెగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ఇక ఇందులో భాగంగా ఏకంగా దళిత బంధు లాంటి స్కీమ్‌న ప్రకటించింది. ఇప్పటికే ఈ రెండు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ మాత్రం ఆ దిశగా సాగట్లేదని తెలుస్తోంది. కాగా ఈ ఉప ఎన్నిక బాధ్యతలను మాత్రం దామోదర నర్సింహ మోస్తున్నారు. అయితే ఇంతకు కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారు అసలు ఎవరిని నిలబెట్టబోతున్నారు అనేది మాత్రం క్లారిటీగా లేదు.
ఇక మొన్నటి వరకు మాజీమంత్రి కొండా సురేఖకు టికెట్ ఇస్తారని బలంగా వినిపిస్తున్నాఆమె మాత్రం చాలా వరకు షరతులతో ఒప్పుకుంటానంటోంది. దీంతో చేసేది లేక ఇప్పుడు కాంగ్రెస్ కూడా బీసీ క్యాండిడేట్‌ను బరిలో దింపేందుకు యోచిస్తోందని తెలుస్తోంది. కానీ ఇక్కడే రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరు పోటీ చేయాలనుకున్నా నేరుగా గాంధీ భవన్ లో ఇప్పునడు ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ కౌంటర్ లో తమ దరఖాస్తులను ఇవ్వాలంటూ సూచించారు. మరి ఇలా బహిరంగంగా ఎవరు ముందుకు వస్తారనేది పెద్ద చర్చ జరుగుతోంది.