తాము దారుణంగా హత్య చేసిన ఖుద్స్ ఫోర్స్ కమాండర్ జనరల్ సులైమానీని ఉద్దేశించి ఆయన హత్య తర్వాత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్య ” ప్రపంచ నెంబర్ 1 ఉగ్రవాదిని హతమార్చామని. వాస్తవానికి అతను అంత సాదాసీదా వ్యక్తి కాదు. ఒక దేశంలో అత్యంత శక్తివంతుడు. అలాంటి వ్యక్తిని చంపాలి అంటే పక్కా ప్రణాళిక, గురి తప్పని లక్ష్యం ఉండాలి. అనుకున్న విధంగా అమెరికా చేయడంలో సఫలం అయింది.
అది పక్కన పెడితే అతని అంతిమ యాత్ర సోమవారం జరిగింది. ఈ యాత్రలో దాదాపు 18 లక్షల మంది ప్రజలు పాల్గొనడం చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఇరాక్ ఇరాన్, సిరియా, లెబనాన్ దేశాల్లో అతనికి భారీగా అభిమానులు ఉన్నారు. అతను మరణించాడు అని తెలియగానే వాళ్ళు అందరూ ఇరాన్ రాజధాని టెహ్రాన్ కు భారులు తీరారు. అమెరికా అంచనాల ప్రకారం 20 లక్షల మంది వరకు,
పాల్గొన్నారని అక్కడి మీడియా అంటుంది. ఇక ఇదిలా ఉంటే, ఈ అంత్యక్రియల్లో దాదాపు 35 మంది తొక్కిసలాటలో మరణించారని సమాచారం. మరో 50 మంది వరకు గాయపడ్డారట. అమెరికా అధ్యక్షుడు ఆయన్ను ఉగ్రవాది అంటూ ఆరోపించినా అక్కడి ప్రజల్లో ఆయనకు ఏ స్థాయిలో మద్దతు ఉందో దీని బట్టే అర్ధమవుతుంది. ఇరాన్ ఇప్పుడు ప్రతీకారంతో రగిలిపోతుంది.