వింత: సరదాతో కలిసి వచ్చిన లాభాలు…! చూస్తే షాక్ అవ్వాల్సిందే…!

సరదాగా చేసేద్దామనుకుంటే ఏకంగా లాభాలే వచ్చాయి. నిజంగా ఈమెది పిచ్చి ఆలోచనైనా చాల డాలర్లు వచ్చాయి. అసలు దీనిని కనుక మీరు చూస్తే షాక్ అవుతారు. పూర్తి వివరాల్లోకి వెళితే… సహజంగా మనం ఫోన్ పాడైపోకుండా… ఏ గీతాలు పడకుండా ఉంచుకోవడానికి ఫోన్ కి కవర్ ని వేస్తాం. ఇందులో వింత ఏమి లేదు అందరు చేసేదే. అయితే ఒకవేళ పాత కవర్ కనుక పాడైపోతే దానిని పడేసి మరో బ్యాక్‌ కవర్ని కొంటాం. అంతే కానీ పాడైపోయిన వాటిని ఎవరికైనా ఫ్రీ గా ఇచ్చిన వాటిని తీసుకోరు.

old phone case
old phone case

కానీ ఈమె మాత్రం సాహసమే చేసింది. ఒక పిచ్చి ఐడియా తో ఏకంగా కోటి రూపాయిలు సొంతం చేసుకుంది. యూట్యూబ్‌ ఇన్‌ఫ్లూయేంజర్‌గా పని చేస్తున్న జర్మనీ కి చెందిన బియాంకా క్లాసెన్ మాత్రం పాడైపోయిన పాత ఫోన్‌ కవర్‌ని ఏకంగా కోటి రూపాయలకు అమ్మింది. ఒకసారి ఆమె ఫోన్తడిసిపోయింది. దానితో బ్యాక్‌ కవర్‌ తీసి కప్‌బోర్డ్‌లో పడేసింది. కొన్నాళ్ళు దాని విషయమే మరచిపోయింది. చాల రోజులు అలానే పడేయడం వల్ల ఆ బ్యాక్‌ కవర్‌ రంగు పోయి.. ఓ పెయింటింగ్‌లా కనిపించింది.

దీనిని చూసిన ఆమెకి ఓ వింత ఐడియా వచ్చింది. దీన్ని అమ్మకానికి పెడితే ఎలా ఉంటుందని అదే చేసింది. ఈ బ్యాక్‌ కవర్‌ని ఈబేలో అమ్మకానికి పెట్టింది. ఈ పాత వాడేసిన కవర్‌కి ఏకంగా 1,62,907 డాలర్లు(1,19,22,153.31 రూపాయలు) చెల్లించేందుకు సిద్ధపడ్డాడు ఒక వ్యక్తి. ఇంకేం ఉంది ఆమె ఎగిరి గంతులేసింది. ఈ డబ్బులని ఒక ఛారిటీకి ఇస్తున్నట్టు వెల్లడించింది. ఏది ఏమైనా ఈమె పిచ్చి పీక్స్.. ఈ తరహా లోనే కామెంట్లు చేసారు నెటిజన్లు.