సోషల్ మీడియాని ఊపేస్తున్న కుక్క, దాని ఫాలోవర్స్ చూస్తే దిమ్మతిరుగుతుంది… వైరల్ వీడియో

-

మనుషులకు కుక్కలకు ఉన్న అవినాభావ సంబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మనిషి జీవితంలో మరో మనిషి కంటే కూడా కుక్కే ఎక్కువగా విశ్వాసంగా ఉంటుంది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా సరే వాస్తవ౦. మనిషి మరో మనిషి ఏదోక సందర్భంలో మోసం చేసే అవకాశం ఉంటుంది. కాని మన ఉప్పు తిన్న కుక్క మాత్రం మనని మోసం చేసే అవకాశం ఎంత మాత్రం ఉండదు. అందుకే ఎక్కువగా నమ్ముతారు. 

మనుషులకు లభించిన స్వచ్చమైన ఆత్మ కుక్కే. దీనితో కుక్కల కోసం చాలా మంది ఆస్తులను కూడా కేటాయించే అవకాశం ఉంటుంది. కోట్లాది రూపాయల ఆస్తులను తమ తదనంతరం కుక్కలకు రాస్తూ ఉంటారు. వాటికి అందమైన పేర్లు పెట్టి ప్రేమగా పెంచుకుంటారు. ఒక కుక్క కొన్నాళ్ళ క్రితం కారు ప్రమాదంలో తన వెనుక కాళ్ళను కోల్పోయింది. నడుం భాగం పూర్తిగా దెబ్బ తింది. నడవలేని స్థితిలోకి ఆ కుక్క వెళ్లిపోయింది.

దీనితో ఆ కుక్క కోసం ప్రత్యేకంగా ఒక వీల్ చైర్ ని కూడా రూపొందించారు. దీనితో ఆ కుక్క ఇప్పుడు చలాకీగా తన వీల్ చైర్ తో సందడి చేస్తుంది. ఈ సందర్భంగా తీసిన ఒక వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇంస్టాగ్రామ్ లో ఆ కుక్కకు దాదాపు లక్ష మంది ఫాలోవార్లు ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ కుక్క సందడి చేస్తున్న వీడియోలు హృదయవిదారకంగా ఉన్నాయి… మరియు జనాలకు సంతోషాన్ని కూడా పంచుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news