బాబోయ్ జెల్లీఫిష్‌లు.. ముంబై బీచ్‌లో క‌ల‌క‌లం..!

-

దేశ వాణిజ్య రాజ‌ధాని ముంబై న‌గ‌రంలో బీచ్‌లో తిర‌గాలంటే స్థానికులు భ‌య‌ప‌డుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అక్క‌డ రాకాసి జెల్లీఫిష్‌లు విప‌రీతంగా సంచ‌రిస్తున్నాయ‌ట‌. అవి అలా బీచ్‌ల‌లో తిరుగుతుండడంతో జ‌నాలు భ‌య‌భ్రాంతుల‌కు లోన‌వుతున్నారు. బీచ్‌కు వెళ్లాలంటేనే స్థానికులు భ‌య‌ప‌డుతున్నారు. వారు అంత‌లా ఎందుకు భ‌య‌ప‌డుతున్నారో తెలుసా..? అందుకు కార‌ణం ఉంది. ఎందుకంటే అవి విష‌పూరిత‌మైన జెల్లీ ఫిష్‌లు మాత్ర‌మే కాదు. ఇవి క‌రిస్తే ఆ భాగంలో విప‌రీత‌మైన నొప్పి క‌లుగుతుంది. వీటి కార‌ణంగా ముంబై బీచ్‌ల‌లో గ‌త రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే ఏకంగా 150 మంది గాయాల బారిన ప‌డిన‌ట్లు తెలిసింది.

ముంబై బీచ్‌లో ఇప్పుడు ఎక్క‌డ చూసినా హెచ్చ‌రిక బోర్డులు కోకొల్ల‌లుగా క‌నిపిస్తున్నాయి. జెల్లీ ఫిష్ లు బీచ్‌లో ఉన్నాయి జాగ్ర‌త్త‌.. అంటూ అధికారులు బోర్డుల‌ను పెడుతున్నారు. ఈ కార‌ణంగా ప్ర‌జ‌లు అక్క‌డి బీచ్‌ల‌కు వెళ్ల‌డ‌మే మానేశార‌ట‌. అయితే దీనిపై అధికారులు స్ప‌ష్ట‌త ఇచ్చారు. ముంబై బీచ్‌ల‌లో సంచ‌రిస్తున్న జెల్లీఫిష్‌లు విష‌పూరిత‌మైన‌వే కానీ ఆ విషం మ‌నుషుల‌ను ఏమీ చేయ‌ద‌ట‌.

జెల్లీఫిష్‌ల‌లో ఉండే విషం కేవ‌లం చేప‌ల‌ను మాత్రమే చంపే శ‌క్తినే క‌లిగి ఉంటుంద‌ట‌. కానీ మ‌నుషుల‌పై ఆ విష ప్ర‌భావం ఉండ‌ద‌ట‌. అయితే జెల్లీఫిష్‌లు క‌రిచిన చోట విప‌రీత‌మైన నొప్పి కొన్ని గంట‌ల పాటు ఉంటుంద‌ట‌. అయితే దాని వ‌ల్ల భ‌య‌ప‌డాల్సిన ప‌నేమీ లేద‌ని అంటున్నారు. కాగా జెల్లీఫిష్ లు ముంబై బీచ్‌లో సంచ‌రించ‌డం కొత్తేమీ కాద‌ట‌. ప్ర‌తి ఏటా అవి వ‌స్తూనే ఉంటాయ‌ట‌. కానీ ఈ సారి మాత్రం అవి భారీ సంఖ్య‌లో వ‌చ్చే స‌రికే ఇలా ఇబ్బందులు వ‌స్తున్నాయ‌ట‌. క‌నుక అవి సంచ‌రిస్తున్న చోటుకి వెళ్ల‌క‌పోవ‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news