వైర‌ల్ వీడియో:  నాగిని డ్యాన్స్ చేస్తూ చ‌నిపోయాడు

మనిషికే కాదు ప్ర‌పంచంలో ఏ జంతువుకు అయినా చావు ఎప్పుడు ?  ఎలా ?  ఏ రూపంలో వ‌స్తుందో ? ఎవ్వ‌రూ ఊహించ‌లేరు. మ‌నిషి పుట్టుక డిసైడ్ చేసే దేవుడు చావును మాత్రం ఎప్పుడు ఎలా డిసైడ్ చేస్తారో ?  ఎవ్వ‌రూ ఊహించ‌లేరు. ఇప్ప‌టి వ‌ర‌కు అంద‌రితోనూ క‌లిసి ఎన్నో అద్భుతాలు చేసిన మ‌నిషి కూడా మ‌రికొద్ది సేప‌ట్లో చ‌నిపోవ‌చ్చు. చనిపోయే వ్యక్తికి కూడా తాను  ఇప్పుడు చనిపోబోతున్నాను అనే విషయం తెలియదు. చనిపోవడం అనేది ఇప్పటికీ ఓ మిస్టరీయే.

ఈ చనిపోవ‌డం అనేది ఎప్పుడు  ఏ రూపంలో వ‌స్తుందో ?  ఊహించ‌లేం. ఇప్పుడు ఈ కింద ఉన్న‌ వీడియో కూడా అలాంటిదే. అప్ప‌టి వ‌ర‌కు అంద‌రితో క‌లిసి మెలిసి డ్యాన్స్ చేస్తున్న వ్య‌క్తే అక‌స్మాత్తుగా కింద‌ప‌డి చ‌నిపోయాడు. గణపతి నిమజ్జనం సందర్భంగా నాగిని డాన్స్‌ చేస్తూ ఓ వ్యక్తి అక‌స్మాత్తుగా మృతి చెందారు. మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

జిల్లాకు చెందిన గురుచరణ్‌ ఠాగూర్‌ అనే వ్యక్తి  మరో ఇద్దరితో కలిసి గణేష్‌ మండపం వద్ద నాగిని మ్యూజిక్‌కి అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. అప్ప‌టి వ‌ర‌కు అంద‌రితో క‌లిసి మెలిసి చాలా ఉత్సాహంతో డ్యాన్స్ చేశాడు. అయితే ఒక్క‌సారిగా కింద‌ప‌డిపోవ‌డంతో ఏమైందా ? అని చుట్టూ ఉన్న వాళ్లు దగ్గరికి వెళ్లి చూసేలోపే అతడు మృతిచెందాడు.

అప్ప‌టి వ‌ర‌కు అంద‌రితో ఉత్సాహంతో డ్యాన్స్ చేసిన అత‌డు చ‌నిపోవ‌డం వీడియోలో స్ప‌ష్టంగా ఉంది. అతడు డ్యాన్స్ చేస్తూ మృతి చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.