క‌రోనా రాకుండా ఉండాల‌ని చెప్పి విమానం మొత్తాన్ని బుక్ చేసుకున్నాడు..!

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌స్తుతం చాలా మంది ప్ర‌జా ర‌వాణా కాకుండా సొంత వాహ‌నాల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. అయితే విమానాల్లో వెళ్లే వారు కూడా జాగ్ర‌త్త‌గా వెళ్తున్నారు. కానీ క‌రోనా వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గానే ఉంటాయి. ఇక ఆ భ‌యంతో ఓ వ్య‌క్తి ఏకంగా ఓ విమానం మొత్తాన్ని బుక్ చేసుకున్నాడు. తాను, త‌న భార్య ఇంకో ప్రాంతానికి వెళ్లాల్సి ఉండ‌గా విమానంలోని టిక్కెట్ల‌న్నింటినీ అత‌నే బుక్ చేశాడు. దీంతో వారు ఇద్ద‌రే ఆ విమానంలో ప్ర‌యాణించారు.

man booked entire flight with the fear of corona virus

ఇండోనేషియాలోని జ‌కార్తాకు చెందిన రిచ‌ర్డ్ ముల్‌జ‌ది అక్క‌డి నుంచి బాలి దీవుల‌కు విమానంలో వెళ్లాల్సి వ‌చ్చింది. కానీ క‌రోనా వ‌స్తుంద‌ని భ‌య‌ప‌డి బ‌తిక్ ఎయిర్ అనే విమాన‌యాన కంపెనీకి చెందిన ఓ ఫ్లైట్ మొత్తాన్ని బుక్ చేసుకున్నాడు. అనంత‌రం అందులో త‌న భార్య‌తో క‌లిసి ప్ర‌యాణించాడు. త‌రువాత త‌న ప్ర‌యాణానికి చెందిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అయ్యాయి. విమానంలో రిచ‌ర్డ్, అత‌ని భార్య ఇద్దరే ఉండ‌డాన్నిగ‌మ‌నించ‌వ‌చ్చు.

అయితే టిక్కెట్ల‌ను బుక్ చేశాక కూడా విమానంలో ఎవ‌రూ ఉండొద్ద‌ని, అలాగైతేనే ప్ర‌యాణం చేస్తాన‌ని ష‌ర‌తు పెట్టాడు. ఇక అత‌ను ఎలాగూ అన్ని టిక్కెట్ల‌ను బుక్ చేసుకున్నాడు క‌నుక కంపెనీ కూడా ఏమీ అన‌లేదు. అత‌న్ని, అత‌ని భార్య‌ను తీసుకెళ్లింది. అయితే క‌రోనా అంటే భ‌యప‌డే రోజులు పోయాయి. ప్ర‌స్తుతం చాలా మంది క‌రోనా జాగ్ర‌త్త‌లు ఏవీ పాటించ‌కుండానే ర‌హ‌దారుల‌పై య‌థేచ్ఛ‌గా తిరుగుతున్నారు. కానీ వారు ఇంత‌లా భ‌య‌ప‌డి ఆ ఆలోచ‌న చేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.