96 ఏళ్ల వ‌య‌స్సులో భారీ బ‌రువు ఎత్తాడు.. వైర‌ల్ వీడియో..!

వృద్ధాప్యంలో ఉన్న‌వారు నిజానికి చాలా మంది భారీ బ‌రువులు ఎత్త‌డం, వ్యాయామం గ‌ట్రా చేయ‌డం వంటి వాటికి దూరంగా ఉంటారు. ఎందుకులే రిస్క్ అని భావిస్తుంటారు. అయితే నిజానికి అది స‌రికాదు. ఎందుకంటే ఏ వ‌య‌స్సులో ఉన్న‌వారు అయినా స‌రే నిత్యం వ్యాయామం చేయాల్సిందే. అయితే ఆయ‌న మాత్రం కేవ‌లం వ్యాయామంతోనే స‌రిపెట్ట‌లేదు. ఏకంగా భారీ బ‌రువును ఎత్తి ఔరా.. అనిపించాడు. అది కూడా 96 ఏళ్ల వ‌య‌స్సులో కావ‌డం విశేషం.

man lifts heavy weight at 96 years of age

కెన‌డాలోని ప్రిన్స్ ఎడ్‌వ‌ర్డ్ ఐల్యాండ్‌లో నివాసం ఉండే డాక్ట‌ర్ బిల్ మేస‌న్ వ‌య‌స్సు 96 ఏళ్లు. ఇటీవ‌లే త‌న జన్మ‌దినాన్ని జ‌రుపుకున్నాడు. అయితే బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న అరుదైన ఫీట్ సాధించాడు. భారీ బ‌రువును ఎత్త‌డంతోపాటు పుష‌ప్స్, సిట‌ప్స్‌, పుల‌ప్స్ చేస్తూ, డంబెల్స్ మోస్తూ, 200 మీట‌ర్ రోను లాగుతూ ఒకే స‌మ‌యంలో క్రాస్ ఫిట్ వ్యాయామం చేశాడు. దీంతో ఆయ‌న చేసిన వ్యాయామం తాలూకు వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by CrossFit (@crossfit)

96 ఏళ్ల వ‌య‌స్సులో ఆయ‌న భారీ బ‌రువు ఎత్త‌డంతోపాటు అలా క్రాస్‌ఫిట్ వ్యాయామం చేసినందుకు గాను నెటిజ‌న్లు ఆయ‌న‌ను అభినందిస్తున్నారు. ఈ వ‌య‌స్సులోనూ ఫిట్‌గా ఉండ‌డం కోసం ఆయ‌న ప‌డుతున్న త‌ప‌న‌కు అంద‌రూ ఆయ‌న‌ను మెచ్చుకుంటున్నారు. అయితే నిజానికి ఆయ‌న‌కు 2 ఏళ్ల కింద‌ట స్ట్రోక్ వ‌చ్చింది. దీంతో అప్ప‌టి నుంచి ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. అలా ఇప్పుడు ఈ ఫీట్ సాధించాడు. అవును.. వృద్ధాప్యం అనేది కేవ‌లం వ‌య‌స్సుకే.. శ‌రీరానికి కాదు.. అని ఆయన నిరూపించాడు.. క‌దా..!