మళ్ళీ చేయి దాటిపోయిన ముంబై, రంగంలోకి అమిత్ షా…?

-

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో కరోనా తీవ్రత ఆందోళన కలిగిస్తుంది. ఇప్పుడు రెండో వేవ్ లో అక్కడ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే కరోనా వైరస్ పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని బిఎంసి (బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్) చెబుతుండగా, గత రెండు రోజుల నుండి వచ్చిన డేటా ఆధారంగా చూస్తే కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుందని అర్ధమైంది.

నవంబర్ 18: 871 పాజిటివ్ కేసులు, నవంబర్ 19: 924 పాజిటివ్ కేసులు, నవంబర్ 20: 1031 పాజిటివ్ కేసులు, నవంబర్ 21: 1092 పాజిటివ్ కేసులు అక్కడ నమోదు అయ్యాయి. దీపావళి అనంతరం కరోనా కేసులు పెరుగుతున్నాయని అంచనా వేస్తున్నారు. దీపావళి నుండి న్యూ ఇయర్ వరకు ముంబైకి కీలకం అవుతుందని నిపుణులు చెప్తున్నారు. ప్రతి మూడు, నాలుగు వారాలకు ఒకసారి కోవిడ్ -19 పరిస్థితిని బిఎంసి సమీక్షిస్తుందని బిఎంసి కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ చెప్పారు. అయితే పరిస్థితిని అదుపు చేయడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నారని జాతీయ మీడియా వర్గాలు చెప్పాయి.

Read more RELATED
Recommended to you

Latest news