స్పెయిన్‌లో పక్కవాళ్ల ఉత్తరాలు చదవడం నేరమట. మన దగ్గర నడుస్తుంది కానీ.. అక్కడ నడవదు. ఖచ్చితంగా దానికి పెద్ద శిక్షే ఉంటుందట.
అవును.. మీరు చదివింది నిజమే. తన సొంత కొడుకుకు వచ్చిన ఉత్తరాన్ని చదివినందుకే ఓ తండ్రికి రెండేళ్లు జైలు శిక్ష విధించారు. అసలు.. ఈ రోజుల్లో లెటర్లు కూడా రాస్తున్నారా? అనే డౌట్ కూడా మీకు వచ్చి ఉంటుంది. అయితే.. ఆ లెటర్ తన తల్లి తరుపు బంధువుల నుంచి వచ్చింది.
ఆ లెటర్‌ను తండ్రి చదివేశాడు. ఆ లెటర్‌నే కోర్టులో సాక్ష్యంగా కూడా ప్రొడ్యూస్ చేశాడు. అక్కడే తిప్పికొట్టింది అంతా. అడ్డంగా ఆ తండ్రి బుక్కయ్యాడు. ఏంటో.. అంతా కన్ఫ్యూజింగ్‌గా ఉందంటారా? పదండి ఓసారి స్పెయిన్ వెళ్లి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఇక్కడ ముందు మనం ఒక విషయం చెప్పుకోవాలి. స్పెయిన్‌లో పక్కవాళ్ల ఉత్తరాలు చదవడం నేరమట. మన దగ్గర నడుస్తుంది కానీ.. అక్కడ నడవదు. ఖచ్చితంగా దానిపై పెద్ద శిక్షే ఉంటుందట. ఇక.. మన కథలోకి వెళ్దాం… పదేళ్ల బాలుడి తల్లి తరుపు బంధువులు ఆ బాలుడికి లేఖ రాశారు. అందులో ఆ బాలుడి తండ్రిపై గృహ హింస కేసుకు సంబంధించి ఉందట. అంతే కాదు.. ఆ బాలుడి తండ్రిని కూడా విమర్శిస్తూ అందులో ఏమో రాశారట.
దీంతో ఆ లెటర్‌ను సాక్ష్యంగా చేసుకొని.. తనను భార్య తరుపు బంధువులు హింసిస్తున్నారంటూ… గృహహింస కేసు పెట్టారంటూ… ఆ వ్యక్తి కోర్టుకు ఎక్కాడు. ఆ లెటర్‌నే సాక్ష్యంగా చూపించాడు. అక్కడే పడింది దెబ్బ. నిజానికి ఆ లెటర్ అతడికి వచ్చింది కాదు.. తన కొడుకుకు వచ్చింది. ఆ లెటర్‌ను చదివినందుకు ముందుకు నువ్వే రెండేళ్లు శిక్ష అనుభవించు అంటూ కోర్టు అతడికి రెండేళ్ల జైలు శిక్ష వేయడంతో పాటు ఫైన్ కూడా వేసింది.