ఇప్పుడు క‌రోనా వ‌స్తుంద‌ని 8 ఏళ్ల ముందే అత‌ను ఊహించాడా ? వైర‌ల్ అవుతున్న ట్వీట్‌..!

-

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ విల‌య‌తాండ‌వం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగానే ల‌క్ష‌ల మంది కోవిడ్ బారిన ప‌డుతున్నారు. ఎన్నో కోట్ల మందిని కోవిడ్ కోలుకోలేని దెబ్బ తీసింది. ఇక క‌రోనా వైర‌స్ చైనాలోని వూహాన్ సిటీకి ద‌గ్గ‌ర్లో ఉన్న ల్యాబ్‌లో నుంచి లీకైంద‌ని ఎప్ప‌టి నుంచో చెబుతున్నారు. కానీ చైనా ఆ విష‌యాల‌ను ఖండిస్తూ వ‌స్తోంది. అయితే క‌రోనా వైర‌స్ ఇప్పుడు వ‌స్తుంద‌ని 8 ఏళ్ల కింద‌టే ఓ వ్య‌క్తి ట్వీట్ చేయ‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

man tweeted about corona virus 8 years ago

మార్కో అనే వ్య‌క్తి 2013, జూన్ 3వ తేదీన క‌రోనా వైర‌స్‌.. ఇట్స్ క‌మింగ్‌.. అని ట్వీట్ చేశాడు. అయితే అక‌స్మాత్తుగా ఆ ట్వీట్ ప్ర‌స్తుతం తెరపైకి వ‌చ్చింది. క‌రోనా వైర‌స్ ఇప్పుడు వ్యాప్తి చెందుతుంద‌ని 8 ఏళ్ల కింద‌టే ఆ వ్య‌క్తి ఎలా గుర్తించ‌గ‌లిగాడు, ఎలా ట్వీట్ చేయ‌గ‌లిగాడు ? అని అంద‌రూ షాక్‌కు గుర‌వుతున్నారు. దీంతో మార్కో చేసిన ట్వీట్ వైర‌ల్ గా మారింది.

అయితే అత‌ను ఏదో హ్యాక్ చేసి ఉంటాడ‌ని, క‌నుక‌నే పాత తేదీతో ట్వీట్ పోస్ట్ అయ్యింద‌ని కొంద‌రు నెటిజ‌న్లు అంటున్నారు. నిజానికి ట్విట్ట‌ర్‌తో పాత డేట్‌తో ట్వీట్ చేయ‌డం కుద‌రదు. ఎందులో అయినా స‌రే ఆ అవ‌కాశం ఉండ‌దు. క‌నుక అది హ్యాక్ కాద‌ని తెలుస్తుంది. అయితే దీనిపై ఇంకా స్ప‌ష్టత రాలేదు కానీ మార్కో ఆ త‌రువాత ట్వీట్లు ఏవీ చేయ‌లేదు. కానీ ఆ ఒక్క ట్వీట్ మాత్రం వైర‌ల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news