అసెంబ్లీలో రాష్ట్రం గురించి చర్చిస్తారు. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలా అని సభ్యులంతా కలిసి నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్ర భవితవ్యాన్ని నిర్ధారించే ఆ అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యే నీచమైన పని చేసి అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ఘటన కర్ణాటక అసెంబ్లీలో చోటు చేసుకున్నది. బీఎస్పీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మహేశ్ అనుమతి లేకున్నా అసెంబ్లీ హాల్ లోకి ఫోన్ ను తీసుకెళ్లాడు. ఎమ్మెల్యేలంతా స్పీకర్ తో రాష్ట్ర అభివృద్ధిపై చర్చిస్తుండగా… ఈ ఎమ్మెల్యే మాత్రం తన ఫోన్ ను ఓపెన్ చేసి అందులో అమ్మాయిల ఫోటోలు చూస్తూ గడిపాడు. ఎమ్మెల్యే అమ్మాయిల ఫోటోలు చూస్తూ కెమెరా కంటికి చిక్కి అడ్డంగా బుక్కయ్యాడు.
కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాలు బెలగావ్ లో జరుగుతున్నాయి. సమావేశాల్లో ప్రజల అభివృద్ధి గురించి చర్చించకుండా.. ఇలా టైమ్ వేస్ట్ చేస్తూ అమ్మాయిల ఫోటోలు చూస్తున్న మహేశ్ ను మీడియా ప్రశ్నించగా.. మీడియాపైనే రివర్స్ అయ్యాడు. తర్వాత తన తప్పు ఒప్పుకొని ఏదో ఒకటి చెప్పి తప్పించుకోబోయాడు కానీ.. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఏం చేయాలో తెలియక తల పట్టుకున్నాడు ఆ ఎమ్మెల్యే.