కన్నబిడ్డను మరిచిపోయి విమానం ఎక్కిన తల్లి.. తర్వాత ఏం జరిగిందంటే?

3

ఏదైనా పరధ్యానంలో ఉంటే మనల్ని మనమే మరిచిపోతుంటాం. కానీ.. ఇటువంటి ఘటనలు జరగడం మాత్రం చాలా అరుదు. ఓ తల్లి.. తన సొంత బిడ్డను మరిచిపోయి విమానం ఎక్కింది. విమానం ఎక్కాక.. విమానం కదిలి కొంచెం దూరం వెళ్లాక అప్పుడు తన బిడ్డ గుర్తుకొచ్చింది. దీంతో వెంటనే విమాన సిబ్బందికి సమాచారం అందించడంతో.. విమానాన్ని మళ్లీ వెనక్కి తిప్పి ఎయిర్ పోర్ట్ కు తీసుకుపోవాల్సి వచ్చింది. ఈ ఘటన సౌదీ అరేబియాలోని అబ్దులజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో చోటు చేసుకున్నది. జెడ్డా నుంచి కౌలాలంపూర్ వెళ్లే విమానంలోనే ఈ ఘటన జరిగింది.

mother forgets her baby and gets into flight in saudi

జెడ్డా ఎయిర్ పోర్ట్ లో డిపార్చర్ వెయిటింగ్ హాల్ వద్ద తన బిడ్డను పడుకోబెట్టి.. విమానం రాగానే ఆతృతగా ఎక్కేసింది ఆ తల్లి. వెంటనే విమానం కెప్టెన్… ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూంకు సమాచారం అందించారు. వెంటనే ట్రాఫిక్ క్లియర్ చేయడంతో విమానం తిరిగి జెడ్డా ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయింది. వెంటనే ఆ బిడ్డను ఎయిర్ పోర్ట్ అధికారులు తన తల్లికి అప్పగించారు. తర్వాత విమానం కౌలాలంపూర్ కు బయలు దేరింది.

amazon ad