ఏందయ్యా సామి..వీళ్ళు అసలు మనుషులేనా..!!

సన్యాసి సన్యాసి కలిస్తే బూడిద రాలుతుందన్న సామెత అందరికి తెలిసిందే..అదే విధంగా ఇద్దరు ఆడ వాళ్ళు ఒక చోట ఉంటే ఇక చెప్పనక్కర్లెదు.మాటల యుద్దాలు జరుగుతాయి.ఇక ఆడాల్ల గొడవ గురించి చెప్పాలంటే మాత్రం మాటలు రావు..యుద్దాలే జరుగుతాయి.. ఇప్పుడు ఓ ఘటన వెలుగు చూసింది..రైల్లో సీటు కోసం కొందరు మహిళలు కొందరురక్తాలు కారేలా కొట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.చూసింది.లోకల్‌ ట్రైన్‌లో సీటు కోసం ముగ్గురు మహిళల సిగపట్లు సంచలనం రేపింది.

ముంబై శివార్లలో జరిగిన ఈ ఘటన జరిగింది. థానే నుంచి పన్వేల్‌ వెళ్తున్న లోకల్‌ ట్రేన్‌లో సీట్లు కోసం ముగ్గురు మహిళల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది..
జుట్టు పట్టుకొని వాళ్లు కొట్టుకున్నారు. ఒకరికొకరు తన్నుకున్నారు. సీట్ల కోసం కొట్టుకున్న మహిళల్లో విద్యావంతులు కూడా ఉండడం అందరిని షాక్‌కు గురిచేసింది. చిన్న విషయంపై వాళ్లు పరిస్థితిని చేజారేదాకా తీసుకొచ్చారు. ముగ్గురిని విడదీసేందుకు తోటి ప్రయాణికులు విశ్వప్రయత్నాలు చేశారు. అయినప్పటికి వాళ్లు వినలేదు. కొంతమంది తోటి ప్రయాణికులకు కూడా గాయాలయ్యాయి..

మొదట మాటలతో మొదలు అయిన అది కాస్త కొట్టుకోవడం వరకూ వెళ్ళింది.మహిళా కానిస్టేబుల్ మహిళా కంపార్ట్‌మెంట్‌లోకి వచ్చి ఈ గొడవను ఆపేందుకు ప్రయత్నించింది. దీంతో కొద్దిసేపు నిశ్చబ్ధంగా ఉండిపోయారు ఆ ముగ్గురు మహిళలు. అయితే ఏమైందోరు తెలియదు కానీ మళ్లీ ముగ్గురు గొడవకు దిగారు. ఈక్రమంలో కొందరి తోటి ప్రయాణికులకు గాయాలయ్యాయి. గొడవను ఆపేందుకు ప్రయత్నించిన మహిళా కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి..వారిని ఆసుపత్రికి తరలించారు.గొడవకు దిగిన ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..కాసేపు ఈ ఘటన రణరంగంగా మారింది..ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది… ఏది ఏమైనా కూడా ఈ ఘటనను చూసిన మగవాళ్ళు అంతా కామెంట్స్ చేస్తున్నారు..