గంగాన‌దిలో నీళ్లు ప్ర‌స్తుతం తాగ‌వ‌చ్చు.. సైంటిస్టుల వెల్ల‌డి..

-

క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా దేశంలో కాలుష్యం స్థాయిలు చాలా గ‌ణ‌నీయంగా త‌గ్గిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా గంగానది చాలా శుభ్రంగా మారింది. అంత‌కు ముందు ఆ న‌ది చుట్టూ ఉన్న ప‌రిశ్ర‌మ‌లు, హోట‌ల్స్ త‌దిత‌రాల వ‌ల్ల ఆ న‌దిలోని నీరు కాలుష్య భ‌రిత‌మైంది. అయితే లాక్‌డౌన్ కార‌ణంగా ఆయా ప్ర‌దేశాల‌న్నింటినీ మూసేశారు. దీంతో కాలుష్య త‌గ్గింది. ఫ‌లితంగా గంగాన‌ది శుభ్రంగా మారింది.

now water in ganga river is drinkable says scientists

అయితే గంగాన‌దిలో కాలుష్యం త‌గ్గ‌డంతోపాటు న‌దిలో నీటి స్థాయిలు పెరిగాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం న‌దిలోని నీటిని తాగ‌వ‌చ్చ‌ని వారు అంటున్నారు. అయితే గంగానదికి చెందిన ప‌లు ప్ర‌స్తుత ఫొటోల‌ను కూడా నెటిజ‌న్లు షేర్ చేసి.. న‌ది ఎంత‌గా శుభ్రంగా మారిందో.. అస‌లు ఇలాంటి స్థితిని చూస్తామ‌నుకోలేద‌ని.. కామెంట్లు పెడుతున్నారు.

ఇక కొంద‌రైతే.. గంగాన‌ది ఇంత శుభ్రంగా మారినందుకు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. కొంద‌రైతే.. మ‌నిషి చేసిన త‌ప్పుల వ‌ల్లే గంగాన‌ది కాలుష్య భ‌రితంగా మారింద‌ని, కానీ ఇప్పుడు ఆ న‌ది శుభ్రంగా మార‌డం సంతోష‌క‌ర‌మ‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం గంగాన‌ది ఫొటోలు నెట్‌లో వైర‌ల్ అవుతున్నాయి..!

Read more RELATED
Recommended to you

Latest news