అమెరికా మద్దతు లేకుండా పైకి వచ్చి అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన దేశాల్లో క్యూబా ఒకటి. అమెరికా ఆ దేశంలో ఏ విధంగా వేలు పెట్టాలి అని చూసినా సరే ఆ దేశ మాజీ అధ్యక్షుడు దివంగత… ఫిడేల్ క్యాస్ట్రో చాలా జాగ్రత్తగా వ్యవహరించి అమెరికాను తమ దేశంలో అడుగు పెట్టకుండా పక్కగా వ్యవహరించారు. మేము లేకుండా క్యూబా ఎలా పైకి వస్తుంది అని సవాల్ చేసిన అమెరికా… ఇప్పుడు ఆ దేశం కాళ్ళు పట్టుకునే పరిస్థితిలో ఉంది.
దేశంలో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పుడు అమెరికా క్యూబా నుంచి వైద్యులను దిగుమతి చేసుకునే ఆలోచనలో ఉంది. ఆ దేశ అధ్యక్షుడికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ కూడా చేసినట్టు సమాచారం. ఆ దేశం మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు అని తెలుస్తుంది. అమెరికాలో క్యూబా వైద్యుల అవసరం చాలా ఉంది కాబట్టి క్యూబాకు భారీగా నిధులు ఇవ్వడానికి సిద్దమవుతుంది.
క్యూబాలో కరోనా ఉన్నా సరే ఆ దేశం మాత్రం చాలా వరకు కట్టడి చేసింది. కేసులు ఉన్నా సరే ఆ దేశ ప్రభుత్వం కంగారు పడకుండా కరోనాను ఎలా కట్టడి చెయ్యాలో అలా చేసింది. ఇప్పుడు క్యూబా నుంచి దాదాపు పది వేల మంది వైద్యులను తమ దేశంలోకి తీసుకొచ్చే ఆలోచన ట్రంప్ సర్కార్ చేస్తుంది. రెండు మూడు రోజుల్లో వీళ్ళను ప్రత్యేక విమానాల ద్వారా తీసుకొచ్చే ఆలోచన చేస్తుంది అమెరికా.