ఓర్నీ ఏదో మాటవరసకు భయపెట్టండి అంటే మరీ ఆ ప్రిన్సిపల్ ఇలా చేశాడేంటి..!

-

ఇంట్లో అల్లరిపిల్లలు ఉంటే ఆ తల్లిదండ్రులు వాళ్లని దారిలోకి తేవడానికే ఎన్నో చేస్తుంటారు.నిన్ను బూచోడికి పట్టిస్తా అంటూ చెప్పి భయపెడుతుంటారు. అలానే ఇక్కడ ఈ చిచ్చరపిడుగు ఇంట్లో ఎ‌వరిమాట వినటంలేదని..స్కూల్ కి వెళ్లినప్పుడు టీచర్లతో చదువు గురించి మాట్లాడుతూ ఏదో మాటవరసకు మా వాడు అసలు మాటేవినడు కొంచెం భయం చెప్పండి అన్నందుకు ఆ ప్రాధానోపాధ్యాయుడు ఏకంగా స్కూల్ బిల్డింగ్ పై నుంచి కిందకు పడైస్తానుంటు బెదిరించాడు. చేయిపట్టుకుని కిందకు వేలాడదీశాడు కూడా. ఉత్తరప్రదేశ్‌ మిర్జాపూర్‌ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.

బాధిత విద్యార్థి పేరు సోను యాదవ్‌. రెండో తరగతి చదువుతున్న సోను యాదవ్‌.. గురువారం లంచ్‌ బ్రేక్‌ సమయంలో కొంతమంది విద్యార్థులను కొరికినట్లు ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. అంతే ఆగ్రహించిన ప్రధానోపాధ్యాయుడు మనోజ్‌ విశ్వకర్మ.. సోను కాలు పట్టుకుని లాక్కొచ్చాడు. చేసిన తప్పుకు క్షమాపణ చెప్పమన్నాడు.. లేదంటే సోనుని బిల్డింగ్‌ పై నుంచి కిందకు పడేస్తానని బెదిరించసాగాడు. చెప్పడమే కాక సోను కాలు పట్టుకుని బిల్డింగ్‌ మీద నుంచి కిందకు వేలాడదీశాడు.

అంతే సోనుకు భయంవేసి గుక్కపట్టి ఏడ్వటం మొదలుపెట్టాడు. దాంతో మిగతా స్టూడెంట్స్‌, టీచర్లు అక్కడకు పరిగెత్తుకుంటూ వచ్చారు. మనోజ్‌ చేతి నుంచి సోనుని అతికష్టంమీద విడిపించారు. ఇంటికెళ్లిన సోను తండ్రికి జరిగిన విషయం చెప్పాడు. కొందరు టీచర్లు మనోజ్‌ చేసిన పనిని వీడియో తీశారు. అది కాస్త నెట్టింట వైరల్ అయింది..

సోను తండ్రి ప్రిన్సిపల్ మనోజ్‌ మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోను తండ్రి మాట్లాడుతూ.. గురువు అంటే విద్యార్థులను ప్రేమగా చూడాలి.. కానీ మనోజ్‌ రాక్షసంగా ప్రవర్తించాడు అన్నాడు. సోను తండ్రి ఫిర్యాదు మేరకు మనోజ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జువైనల్‌ జస్టిస్‌ యాక్ట్‌ కింద అతడి మీద కేసు నమోదైంది.

ప్రిన్సిపల్ ఏం అంటున్నాడంటే..

సోను చాలా తుంటరి పిల్లాడు. విద్యార్థులనే కాదు టీచర్లను కూడా కొరుకుతాడు. బుద్దిగా ఉండడు.. ఎవరి మాట వినడు. సోను తండ్రే తన పిల్లాడిని మార్చమని చెప్పాడు..అందుకే నేను సోనిని భయపెట్టడం కోసం ఇలా చేశాను అంటున్నాడు మనోజ్.భయపెట్టమంటే.. మరీ ఇలా చేయాలా అని అందరూ ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news