ఆ పాప కంట్లోంచి బియ్యం, రాళ్లు.. వైద్యులమే లైట్‌ తీసుకుంటున్నారు..!!

సాయిబాబా ఫోటో నుంచి ఈబూది రావడం, చెట్టు నుంచి పాలు రావడం లాంటి వార్తలను మనం వినే ఉంటాం. కంట్లో చిన్న నలక పడితేనే.. ఆగం ఆగం అయిపోతాం. అలాంటిది.. ఒక మనిషి కంట్లోంచి బియ్యం, రాళ్లు వస్తే. పాపం ఆ పాప కంట్లోంచి రాళ్లు, బియ్యం వస్తున్నాయట.. రోజూ రాళ్లు కంటి నుంచి బయటకు వస్తున్నాయి. కంటిలో చిన్న నలుసు పడితేనే విలవిలలాడుతాం మనం. అలాంటిది ఓ చిన్నారి కంటిలో నుంచి ఏకధాటిగా రాళ్లు, బియ్యపు గింజలే వస్తున్నాయి. రెండ్రోజుల నుంచి నొప్పితో తీవ్ర అవస్థలు పడుతోంది. వినడానికి వింతగా ఉన్న ఈ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. మానవపాడులోని రంగన్న, లక్ష్మి దంపతుల కూతురు దీపాలి కళ్లలోంచి చిన్న చిన్న రాళ్లు, బియ్యం గింజలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడీ వార్త వైరల్‌ అవుతోంది. కంట్లోంచి రాళ్లు, బియ్యం రావడం ఏంటి అనుకుంటున్నారా..?
గత రెండు రోజులు నుంచి చిన్నారి ఈ బాధతో విలవిలాడుతోంది. కర్నూలులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యులు స్కానింగ్‌ పరీక్షలు చేసి.. ఏం లేదని చెప్పారు. దాంతో.. దీపాలిని మళ్లీ ఇంటికి తీసుకొచ్చారు. ప్రతిరోజు పాప కంటి నుంచి 10 నుంచి 12 చిన్న చిన్న రాళ్లు, బియ్యపు గింజలు బయటకు వస్తున్నాయి. ఇది వింత అనిపించినా..ఆ చిన్నారి మాత్రం తీవ్రమైన నొప్పితో బాధపడుతోంది. ఏం చేయాలో అర్థంకాక దీపాలి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
అసలు పాప కంట్లోంచి అలా ఎందుకు రాళ్లు, బియ్యం వస్తున్నాయో తెలియదు.. వైద్యులకు చూపించినా లాభం లేదు.. కానీ ఆ పాప మాత్రం తీవ్రమైన నొప్పితో నరకం అనుభవిస్తుంది. 15 నిమిషాలకు ఒకసారి కుడి కంటిలోంచి బియ్యపు గింజలు, రాళ్లు వస్తుండడంతో నొప్పి భరించలేక చిన్నారి నరకయాతనకు గురవుతున్నది.