నది తగలబడుతోంది…!

-

అవును మీరు చదివింది అక్షరాలా నిజం. ఒక ప్రాంతంలో ముడి చమురు పైప్ లైన్ పేలడంతో గత రెండు రోజులుగా ఒక నదీ భాగ౦ మంటల్లో కాలిపోతుంది. గువహతి నుండి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిబ్రుగర్, జిల్లాలోని నహర్కటియా పట్టణంలోని బుర్హి డిహింగ్ నది యొక్క చిన్న భాగం మంటల్లో చిక్కుకుంది. శనివారం ఈ ప్రాంతంలో మంటలు చెలరేగాయని అధికారులు చెప్పారు.

ఎగువ అస్సాం ప్రాంతంలోని అన్ని ఆయిల్ ఇండియా క్షేత్రాల నుండి ముడి చమురు సేకరించే సెంట్రల్ ట్యాంక్ పంప్‌లో “అరుదైన ఇన్స్ట్రుమెంటేషన్ లోపం” కారణంగా లీకేజీ జరిగిందని ఆయిల్ ఇండియా అధికారులు తెలిపారు. మంటలు అదుపులో ఉన్నాయని ఆయిల్ ఇండియా పేర్కొంది. అదే విధంగా దాని తీవ్రత తగ్గించడానికి నిపుణుల బృందం ఆ ప్రదేశంలోనే ఉందని అధికారులు వివరించారు.

ముడి చమురు నదిలోకి లీక్ అయిన తరువాత ప్రజలు మంటలు ఆర్పడానికి చేసిన కొన్ని ప్రయత్నాలు వాటి తీవ్రతను పెంచాయని అధికారులు అంటున్నారు. అయితే ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని అధికారులు అంటున్నారు. జనవరి 31 మరియు ఫిబ్రవరి 1 మధ్య రాత్రి పైపులైన్ పేలిందని ఆయిల్ ఇండియా సీనియర్ మేనేజర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్) త్రిదీవ్ హజారికా మీడియాకు తెలిపారు. ఫిబ్రవరి 1 మరియు 2 మధ్య మంటలు చెలరేగాయని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news