అది సర్కారు బడి.. అంటే పేద, మద్యతరగతి ప్రజల బిడ్డలు చదువుకునే బడన్నమాట. ఈ బడిలోకి వెళ్లే పేద విద్యార్థుల కోసం సర్కారు కరెంట్ కనెక్షన్ ఇచ్చింది.. ఇది కూడా డిజిటల్ ఇండియాలో భాగంగా పిల్లలకు దూరదర్శన్ ద్వారా పాఠాలు చెప్పె కార్యక్రమం కోసం కరెంట్ ఏర్పాటు చేశారట. అయితే విద్యార్థులకు దూరదర్శన్ పాఠాలు చెప్పింది లేదు.. కరెంట్ వినియోగించింది లేదు.. కానీ కరెంట్ బిల్లు చూస్తే కళ్ళు బైర్లు కమ్మక తప్పదు.
అది దేశ ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్‌లోని వారణాసి పార్లమెంట్ స్థానం. ఇక్కడ ఓ ప్రభుత్వ పాఠశాల ఉంది. అది వారణాసి పట్టణంలోని వినాయక్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాల. ఈ పాఠశాలకు ఉన్న విద్యుత్ కనెక్షన్‌కు మీటర్ రీడింగ్ తీశారట విద్యుత్ అధికారులు. ఈ మీటర్ రీడింగ్ తీసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు విద్యుత్ అధికారులు. ఆ తరువాత బిల్లు చూసి నోరెళ్ళబెట్టాడట ఆ ప్రధానోపాధ్యాయుడు. ఇంతకు బిల్లు ఎంతొచ్చిందనుకుంటున్నారు.. అక్షరాల రూ.618 కోట్ల, 51లక్షల 50వేల 163 లు మాత్రమే.
ఇంత భారీ బిల్లు ఏ ఎత్తిపోతల పథకాలకు తప్పితే మరే సంస్థకు ఇంతగా రావన్నది సత్యం. ఇది స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి పట్టణంలో. ఓ విద్యుత్ అధికారి ఇచ్చిన తప్పుడు ఫీడింగ్‌తో ఈ సంఘటన జరిగిందన్నది వాస్తవం. కానీ దీన్ని సరిచేయమని విద్యుత్ అధికారులు చుట్టూ ఇప్పుడు ప్రధానోపాధ్యాయుడు కాళ్లరిగేరా తిరుగుతున్నా కనీసం కణికరించేవారు కరువయ్యారట. మీరు ఏమి చేస్తారో మాకు తెల్వదు.. కరెంట్ బిల్లు కట్టాల్సిందే.. లేకుంటే కనెక్షన్ కట్ చేస్తామంటూ హుకుం జారీ చేసారట విద్యుత్ అధికారులు.
అంతే కాదు ఈనెల 7వ తేదిలోపు కచ్చితంగా కట్టి తీరాల్సిందేనని అన్నారట. ఈ బిల్లు వ్యవహారంను పాఠశాల సిబ్బంది శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళారట.. ఇక వారు ఏమి చేస్తారో వేచి చూడాల్సిందే.. ఇదిలా ఉంటే … ఓ దేశ ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ స్థానంలో ఇలా కరెంట్ బిల్లులు ఇష్టారాజ్యంగా వేస్తుంటే.. ఇక సామాన్య జనం పరిస్థితి, సాధారణ ప్రాంతాల్లో ఇంకా ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు సాప్ట్‌వేర్ నిర్వహకుడి తప్పిదమా… లేక మీటర్ రీడింగ్ తీసిన విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యమా… తేల్చాల్సి ఉంది.. ఇప్పుడు ఈ పాఠశాల విద్యుత్ బిల్లు వ్యవహారం మీడియాలో వైరల్‌గా మారింది.