ఇటీవలే టర్కీలో అనుకుంటా. ఫుట్‌పాత్‌పై నడుస్తూ వెళ్తున్న ఇద్దరు యువతులు… ఒక్కసారిగా సింక్ హోల్ ఏర్పడటంతో దాంట్లో కూరుకుపోయారు. వాళ్ల అదృష్టం బాగుంటి బయటపడ్డారు. ఇలా.. సింక్ హోల్ కుంగిపోవడం అనే ఘటనలు ఇప్పటి వరకు మనం చాలానే చూశాం. ఇలాంటిదే ఓ ఘటన చైనాలోని లాంజౌ అనే నగరంలో చోటు చేసుకున్నది. ఓ మహిళ ఫుట్‌పాత్‌పై నడుస్తూ వెళ్తున్నది. ఇంతలో ఫుట్‌పాత్ కుంగిపోయింది. దీంతో ఆ మహిళ సింక్ హోల్‌లో పడిపోయింది. ఆమెను గమనించిన స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా అందులో కూరుకుపోవడంతో ఆ మహిళ పక్కటెముకలు విరిగిపోయాయట. కాకపోతే ప్రాణాపాయం ఏం లేదు కానీ.. అసలు ఆ ఫుట్ పాత్ మీద సింక్ హోల్ ఎందుకు ఏర్పడిందా అని ఆరా తీస్తున్నారు పోలీసులు. ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డవడం.. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవడంతో ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది.
ఫుట్‌పాత్‌పై నడిచేటప్పుడు జాగ్రత్త.. ఎందుకో ఈ వీడియోలో చూడండి..!
-