కొండ‌చిలువ‌తో ముగ్గురు చిన్నారుల పోరాటం.. వైర‌ల్ వీడియో

2314

సాధార‌ణంగా కొండ‌చిలువ‌కు పెద్ద‌లే భ‌య‌ప‌డ‌తారు. అలాంటిది ముగ్గురు చిన్నారులు పెద్ద సాహ‌స‌మే చేశారు. ఓ బుజ్జి కుక్కను కాపాడేందుకు ఆ ముగ్గురు చిన్నారులు ఓ కొండ‌చిలువ‌తో పోరాడారు. ఈ వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతుంది. ఆ ముగ్గురు చిన్నారుల ధైర్య సాహ‌సాలు చూసి నెటిజ‌న్లు వీర లెవ‌ల్లో మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే.. ఓ కొండ‌చిలువు కుక్క‌ను బంధించింది. అది చూసిన ముగ్గురు చిన్నారులు  ఏ జంకు బెదురు లేకుండా దానిపై దాడి చేశారు.

కుక్కను కొండచిలువ చెరనుంచి బయటపడేసేందుకు నానా రకాలుగా ప్రయత్నించారు. తమకు దొరికిన ఆకులు, అలుమలను వాటిపై విసురుతూ.. రాళ్లతో కొడుతూ.. దైర్య సాహసాలు ప్రదర్శించారు. అప్ప‌టికీ కొండ‌చిలువ కుక్క‌ను వ‌ద‌ల‌క‌పోవ‌డంతో మ‌రింత ధైర్యంతో ఒకరు కొండచిలువ తలను.. మరొకరు తోకను పట్టాడు. ఇంకొకరు కుక్కను చాలా జాగ్రత్తగా దాన్నుంచి విడదీశారు.  దాని పట్టు నుంచి తప్పుకున్న కుక్క ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగుపెట్టింది.  ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది. దీంతో కుక్కును ర‌క్షించిన చిన్నారుల‌కు నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.