వైరల్ వీడియో; తిరుమల ఆలయాన్ని కాపాడుతున్న ఎలుగుబంట్లు…!

-

కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గానూ ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించడం తో ప్రజలు ఇళ్లకే పరమితం అయిపోయారు. దీనితో అడవి జంతువులు తమకు నచ్చిన విధంగా రోడ్ల మీదకు వస్తున్నాయి. ఎలుగుబంట్లు, చిరుత పులులు, అడవి పందులు ఇలా ప్రతీ ఒక్కటి ఇప్పుడు రోడ్ల మీదకు వస్తూ సందడి చేస్తున్నాయి. ఈ వీడియో లు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమలలో ఒక జత అడవి ఎలుగుబంట్లు తిరుగుతున్నట్లు ఒక వీడియో వైరల్ అవుతుంది. తిరుమలలో రాత్రి ఎలుగుబంట్లు తిరుగుతున్న వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత నందా పంచుకున్నారు. “ఇది తిరుమల వద్ద విహరిస్తున్న ఎలుగుబంట్లు, దేవుని నివాసంలో అంతా సరేనా అని చూడటానికి.” వెంకటేశ్వర ఆలయం తిరుమలలో ఉన్నందున ఆయన ఈ విధంగా కామెంట్ చేసారు.

వీడియోలో, రెండు ఎలుగుబంట్లు రోడ్డుపైకి వచ్చి వీధిని దాటడాన్ని చూడవచ్చు. ఈ వీడియో కి సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది. కుదిరితే అవి ఏడు కొండల వాడిని ధర్శించుకుంటాయి అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రియమైన ఎలుగుబంట్ల నైట్ పెట్రోల్ పార్టీ అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా శ్రీవారి దర్శనాన్ని వచ్చే నెల 31 వరకు టీటీడీ రద్దు చేసి, టికెట్ లు బుక్ చేసుకున్న వారికి రీఫండ్ ఇస్తామని ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news