ఇండియా ని కరోనా నుంచి కాపాడగలిగే మోడీ నయా సూపర్ ప్లాన్ ఇదే ?

-

ప్రపంచంలో అన్ని విధాలా అభివృద్ధి చెందాము మాకు తిరుగులేదు అని అనుకున్న దేశాలు కరోనా వైరస్ దెబ్బకి నామరూపాలు లేకుండా పోయాయి. ప్రపంచానికి అగ్రరాజ్యం అనిపించుకునే అమెరికా సైతం కరోనా వైరస్ ని ఎదుర్కొనలేక పోతుంది. ఇటువంటి టైములో భారతదేశాన్ని ప్రధాని మోడీ ముందుండి కరోనా వైరస్ ని కట్టడి చేయడంలో కీలకంగా వ్యవహరించారు. లాక్ డౌన్ అమలు చేసి దేశంలో కరోనా వైరస్ విస్తరించకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. మొట్టమొదటిసారి 21 రోజులు అనుకున్నా గానీ వైరస్ ఉన్న కొద్దీ విస్తరిస్తున్న నేపథ్యంలో 40 రోజుల వరకూ మోడీ ఇటీవల లాక్ డౌన్ నీ పొడిగించిన సంగతి అందరికీ తెలిసినదే.Narendra Modi: PM Narendra Modi to address nation at 8 pm todayఅయితే ఏప్రిల్ 20 తర్వాత లాక్ డౌన్ కొన్ని సడలింపు లతో అమలు చేయబోతున్నట్లు మోడీ మొన్న ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. వ్యవసాయ రంగానికి అదేవిధంగా కొన్ని చిన్న చిన్న పరిశ్రమలకు అనుమతి ఇవ్వడం జరిగింది. వీటిలో ఈ కామర్స్ కూడా ఉంది. అయితే ఇటీవల ఈ కామర్స్ సంస్థల వల్ల ప్రజలు భయపడుతున్నారు. ఎందుకంటే ఢిల్లీలో పిజ్జా డెలివరీ బాయ్ వల్ల 70 కుటుంబాలు ఏకంగా క్వారంటైన్ కి వెళ్లడంతో….ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ అంత సేఫ్ కాదని ప్రజలు భావిస్తున్నారు.

 

ఇదే తరుణంలో అధికారులు కూడా ఈ ఆన్ లైన్ అమ్మకాలపై నిషేధాలు మళ్లీ కొనసాగించే ఆలోచనలో ఉన్నారు. దీంతో తాజా ఘటనతో ఈ కామర్స్ సంస్థల ఎత్తివేత నిర్ణయం పై కేంద్రం పునరాలోచిస్తోందని సమాచారం. అంతేకాకుండా మోడీ నయా సూపర్ ప్లాన్ తరహాలో కొన్ని మార్గదర్శకాలు తీసుకురావడానికి మేధావులతో చర్చిస్తున్నట్లు తాజాగా జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. అదేమిటంటే. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా నగరాల్లోనే ఉండటంతో…సిటీలలో పూర్తిగా లాక్ డౌన్ పొడిగించాలని అనుకుంటున్నారట. ఈ క్రమంలో గ్రామాల్లో వ్యవసాయం ఎక్కువగా ఉండటంతో …. వైరస్ పాజిటివ్ కేసులు లేని గ్రామీణ ప్రాంతాలలో పూర్తిగా లాక్ డౌన్ ఎత్తేయాలనే ఆలోచనలో మోడీ ఉన్నారట. ఇక పట్టణాలలో…కరోనా వైరస్ పాజిటివ్ కేసులు జీరో వచ్చేవరకు…లాక్ డౌన్ పొడిగించాలని డిసైడ్ అవుతున్నట్లు సమాచారం.

 

Read more RELATED
Recommended to you

Latest news