ఈ భారీ వరదలను తట్టుకోవాలంటే.. గొంతులో సుక్క పడాల్సిందేరా అబ్బాయ్..!!

ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. బీడీ ముట్టించుకోవడానికి నిప్పు అడిగాడట వెనుకటికి ఒకడు అన్న చందంగా మారింది వీళ్ల పరిస్థితి. ఇప్పుడు కేరళ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవు.. ఉండటానికి ఇల్లు లేదు.. తినడానికి తిండి లేదు.. కట్టుకోవడానికి బట్టలు లేవు. అన్నీ ఉన్నా ఏమీ లేని వాళ్లలా బతుకులను నెట్టుకొస్తున్నారు కేరళ వాసులు.

భారీ వరదలతో రాష్ట్రమంతా కొట్టుకుపోయి ఏడుస్తుంటే మరోవైపు వీళ్ల పని చూడండి. ఏం చేస్తున్నారో.. వాళ్లేం చేస్తున్నారో ముందు ఈ వీడియోలో చూడండి. తర్వాత మాట్లాడుకుందాం మనం.

వీడియో చూశారా. వాళ్లు వరదలో కొట్టుకుపోతున్న వారిని.. వరదలో చిక్కుకున్న వాళ్లను కాపాడటానికి అంత సాహసం చేస్తున్నారేమో అని అనుకున్నారు కదా ముందు? కానీ.. తీరా చూస్తే వాళ్లు ప్రాణాలకు తెగించి మరీ ఇదంతా చేసింది మందు బాటిళ్ల కోసం. కేరళ అంతా కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే కదా. అక్కడికి దగ్గర్లోని ఏదో వైన్ షాప్ కూడా వరదల్లో కొట్టుకుపోయి ఉంటుంది. దీంతో మందు బాటిళ్లన్నీ వరదల్లో కొట్టుకుపోతున్నాయి. దీన్ని గమనించిన కొంతమంది వ్యక్తుల ప్రాణాలకు తెగించి మరీ వరదలో కొట్టుకుపోతున్న వైన్ బాటిళ్లను పట్టుకొని ఓ బట్టలో ముట కట్టి అక్కడి నుంచి తుర్రుమన్నారు. ఇంత భారీ స్థాయి వరదలను తట్టుకోవాలంటే గొంతులో ఓ సుక్క పడాల్సిందేనంటారా? వీళ్ల తతంగాన్ని గమనించిన ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలవడమే కాదు.. నెటిజన్లు ఆ మందుబాబులకు క్లాస్ పీకుతున్నారు.