నాలుగేళ్లలో నక్సలిజం తగ్గింది- కేంద్రహోంశాఖ

-

గత నాలుగేళ్ల కాలంలో నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో సమస్య కొంతమేర తగ్గిందని నేడు జరిగిన 10 రాష్ట్రాల సమావేశంలో కేంద్ర హోం శాఖ అభిప్రాయపడింది. గత నాలుగేళ్లలో నక్సలిజం 23 శాతం, మరణాలు 21 శాతానికి తగ్గాయని కేంద్ర హోం శాఖ తెలిపింది.  ఆదివారం కేంద్ర హోం మంత్రితో జరిగిన సీఎంల సమావేశంలో అన్ని రాష్ట్రాల సీఎంలు మావోయిస్ట్ ప్రభావాన్ని తగ్గంచేందుకు అవసరమయ్యే చర్యల గురించి కేంద్ర హోంశాఖకు వివరించింది. ముఖ్యంగా ప్రభావిత ప్రాంతాల్లో అభివ్రుద్ధి సాధిస్తేనే నక్సల్ ప్రభావాన్ని పూర్తిగా తగ్గంచవచ్చని సమావేశంలో అభిప్రాయపడ్డారు. మావోయిస్టులకు వ్యతిరేఖంగా చేయాల్సిన ఆపరేషన్ల గురించి, మావోయిస్ట్లకు మద్దతు ఇచ్చే సంస్థలపై తీసుకోవాల్సిన చర్యల గురించి సమావేశంలో చర్చించారు. వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి అన్ని రాష్ట్రాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యంగా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో టెలికాం సేవలను మరింతగా మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని పలు రాష్ట్రాల సీఎంలు అధికారులు కేంద్రహెంశాఖ ద్రుష్టికి తీసుకెళ్లారు.

Read more RELATED
Recommended to you

Latest news