ప్రేమించుకోవడాలు విడిపోవడాలు ఇప్పుడు కామన్ అయిపోయాయి. ఎంత సులభంగా కలుస్తున్నారో అంత సులభంగా విడిపోతున్నారు. బ్రేకప్ అన్న దానికి పెద్ద ప్రాముఖ్యం లేకుండా పోయింది. ఐతే మీరు ప్రేమించి విడిపోయాక కూడా అదే వ్యక్తితో ప్రేమలో పడడానికి అవకాశం ఉంది. అలా ఉన్నప్పుడు మీరేం చేస్తారు? ఎలాంటి అంశాలు సంకేతాలుగా కనిపిస్తాయో ఇక్కడ చూద్దాం.
ఇతరులతో పెద్దగా మాట్లాడకపోవడం
బ్రేకప్ అయ్యాక ఇతరులతో కలిసిపోకుండా మూడీగా ఉన్నట్లుగా ఉన్నారంటే అవతలి అమ్మాయిపై మీకు ప్రేమ ఉన్నట్టే లెక్క. ఎంత తెంపుకున్నా ఎంతో కొంత ప్రేమ దాగి ఉంటుంది. ఆ కొంత ప్రేమ చాలు గుండెల్లో సుళ్ళు తిరిగి రక్తం మొత్తం ప్రేమమయం చేయడానికి.
అవతలి వారిని బాగా మిస్సవడం
ఎంతో మంది మధ్యలో ఉన్నప్పటికీ మీకు ఆనందం లభించడం లేదంటే మీ ప్రేమ ఇంకా తెగిపోలేదన్నమాట. మాటి మాటికీ అవతలి వారి జ్ఞాపకాలు గుర్తుకురావడం, వాళ్ళుంటే ఇంకా బావుండేదన్న ఫీలింగ్ రావడం, వాళ్ళకి నచ్చిన పనులు చేస్తూ వారి దృష్టిలో పడాలని ప్రయత్నించడం.
సోషల్ మీడియా వాడకంలో మార్పులు
బ్రేకప్ ని ప్యాచప్ చేసుకోవాలనుకునే వారు సోషల్ మీడియా ద్వారా ఆ సందేశాన్ని అవతలి వారికి పంపిస్తారు. అవతలి వారికి ఇష్టమైన పోస్టులు పెట్టడం దగ్గర నుండి ఇష్టమైన పనులు చేయడం వరకు సోషల్ మీడియాను బాగా వాడతారు.
వేరే ఎవ్వరిపై పెద్దగా ఫీలింగ్ కలగకపోవడం
చాలామంది ఒక దగ్గర బ్రేకప్ కాగానే మరో దగ్గర ప్యాచప్ కావాలని చూస్తారు. కానీ, ఇతరులపై పెద్దగా ఫీలింగ్ లేకుండా ఉండడం, ఇతరులు చనువు తీసుకుంటున్నా దూరం జరగడం మొదలగునవి అంతకుముందు ప్రేమమీద ఆసక్తి ఉందని చెబుతాయి.