ఎంగిలిపువ్వు బతుకమ్మరోజు ఏం చేస్తారో తెలుసా?

-

పూల పండుగ. ప్రపంచంలోనే అరుదైన పండుగ. మొదటి రోజు అంటే పెత్తరమాస నాడు ఉదయాన్నే లేచి ఇంటి ముందుట ముగ్గులు వేసుకుని, తలంటు స్నానం చేసి తరువాత దేవుని దీపాలు, పూజ, పూలతో బతుకమ్మను పేర్చి, దేవుడి దగ్గర బతుకమ్మ-గౌరమ్మకు పూజచేస్తారు. అనంతరం నైవేద్యాలను సమర్పిస్తారు.

నైవేద్యాలు: పులిహోర, పాయసం, బజ్జిలు, వడలు (ప్రాంతాలను బట్టి పదార్థాల్లో మార్పులు ఉండవచ్చు) చేసి అమ్మవారికి అంటే బతుకమ్మకు నివేదిస్తారు. మధ్యాహ్న భోజనాలు చేసి సాయంత్రం తిరిగి దీపారాధన చేసి బతుకమ్మ దగ్గర పండ్లు నైవేద్యం సమర్పిస్తారు. తర్వాత ఇంటి ముందర బతుకమ్మను ఉంచి కనీసం మూడు ప్రదక్షిణాలు చేస్తారు. తర్వాత ముత్తైదువలు, బాలికలు, బతుకమ్మను దగ్గర్లోని నాలుగు కూడళ్లు లేదా దేవాలయం తీసుకుని పోతారు. అక్కడ సామూహికంగా బతుకమ్మలన్ని ఒక దగ్గర పెడుతారు. ఇక్కడ వెంపలి చెట్టును నాటి దాని దగ్గర బతుకమ్మలను పెడుతారు.

అందరూ అక్కడికి తెచ్చిన పసుపులను ఒక పెద్ద ముతైదవ తీసుకుని గౌరమ్మను చేసి వెంపలి చెట్టు దగ్గర పెడుతారు. ఆ గౌరమ్మకు పూజ చేస్తారు, తర్వాత బతుకమ్మకు పప్పు ఫలహారాలు నివేదించి అనతరం వాటి చుట్టూ పాటలు పాడుతూ, లయబద్ధంగా భక్తితో పాటలు పాడుతారు. ఆటలు ఆడుతారు. తర్వాతి చెరువులో బతుకమ్మను వదిలి పెట్టివచ్చి గౌరమ్మను స్తాంబాలంలో వలలాడిస్తారు. అందరు తెచ్చిన ప్రసాదాలను ఇచ్చిన వాయనం, పుచ్చుకుంటి వాయనం అని భక్తితో స్వీకరిస్తారు. తర్వాత తమ తమ ఇండ్లకు వెళ్తారు. ఇలా మొదటి రోజు బతుకమ్మను ఆరాధించండం, ఆడటం చేస్తారు.
– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version