నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు దుర్గాష్టమి. ఈసారి దుర్గాష్టమి అక్టోబర్ 2న వచ్చింది పార్వతి దేవి స్వరూపమే మహా గౌరీ. మహా గౌరీ దేవిని పూజించడం వల్ల సంపద పెరుగుతుంది. తెలివి తేటలు కూడా పెరుగుతాయి అని అంటారు. పిల్లలు దుర్గాష్టమి రోజు పార్వతీదేవికి పూజ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది.
అలానే దుర్గాష్టమి రోజు ఆయుధ పూజలని కూడా చేస్తూ ఉంటారు. వాహనాలని వస్తువులను పూజిస్తూ ఉంటారు. పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. చాలామంది ఈ రోజున ఉపవాసం కూడా ఉంటారు.
దుర్గాష్టమి నాడు పూజ ఎలా చేయాలి..?
ఇక పూజని ఎలా చేయాలి అనేది చూస్తే.. దుర్గాష్టమి రోజు మహా గౌరీ దేవికి పూలను పెట్టి పూజించాలి. కలశ పూజ చేసి అమ్మవారికి పూజ చేస్తే మంచిది తర్వాత శనగలు కొబ్బరికాయను నైవేద్యంగా పెట్టాలి. చాలామంది ఈ రోజున అన్నదానం కూడా చేస్తూ ఉంటారు దీని వల్ల కూడా మంచి ఫలితం వస్తుంది. కనక దుర్గమ్మ దుర్గా మాత రూపంలో దుర్గాష్టమి రోజున దర్శనమిస్తారు. ఆలయాల్లో కూడా దుర్గా దేవికి పూజలు చేస్తుంటారు.
లక్ష్మీ దేవి శ్లోకాలు:
లక్ష్మీదేవి
యా దేవి సర్వ భూథేషు
లక్ష్మీ రూపేణ సంస్థిథా
నమస్థస్యై నమస్థస్యై
నమస్థస్యై నమో నమహ
నమస్తేఽస్తు మహామాయే
శ్రీపీఠే సురపూజితే
శఙ్ఖచక్రగదాహస్తే
మహాలక్ష్మి నమోఽస్తుతే
కరాగ్రే వసతే లక్ష్మీః
కరమధ్యే సరస్వతీ
కరమూలే థు గోవింధా
ప్రభాతే కరదర్శనమ్
సర్వ మంగల మాంగల్యే
శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే గౌరీ
నారాయణి నమోస్తుతే
సముద్ర వసనే దేవీ
పర్వత స్తన మండలే
విష్ణుపత్ని నమస్తుభ్యం
పాదస్పర్శం క్షమస్వమే
అన్న పూర్ణే సధా పూర్ణే
షంకర ప్రాణ వల్లభే
గ్నన వైరాగ్య సిద్ధ్యర్థం
భిక్షాం ధేహి చ పార్వథి
మథా చ పార్వథీ దేవీ
పిథా దేవో మహేష్వరహ
భాందవాహ షివ భక్థాష్చ
స్వధేషో భువనథ్రయం..