అసలైన సంక్రాతి అంటే ఇదే.. మరి ఈ సరదాల సంక్రాంతి రహస్యాలని చూసేద్దాం..!

-

మకర సంక్రాంతి పండుగ అంటే ఎంతో అందంగా ఉంటుంది. నిజానికి మకర సంక్రాంతిని సరదాల సంక్రాంతి అని కూడా అంటారు. చాలా మంది ఈ మధ్య కాలం లో సిటీ లైఫ్ కి అలవాటు పడి మన పద్ధతులని… పండుగని మర్చిపోతున్నారు. అయితే మకర సంక్రాంతి ని మన తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటారు. అయితే మనం మకర సంక్రాంతి అని పిలుస్తాం కానీ ఇతర రాష్ట్రాలలో పొంగల్ అని జరుపుకుంటారు.

అచ్చమైన సంక్రాంతి అంటే ఇదే…

సంక్రాంతి అంటే మనకి ఆంధ్రప్రదేశ్ లో రంగు రంగుల ముగ్గులు కనబడుతూ ఉంటాయి అలానే గొబ్బిళ్ళు, కోడిపందాలు, పిండి వంటలు, గంగిరెద్దులు, భోగి మంటలు, గాలి పటాలు, బసవన్న చిందులు, హరిదాసు పాటలు ఇలా ఎంతో చక్కగా సంక్రాంతి పండుగ ఉంటుంది కొత్త అల్లుళ్లతో ఇల్లంతా కూడా పండుగ శోభతో కళకళలాడుతుంది. సంక్రాంతి సమయానికి రైతుల చేతికి పంట కూడా వస్తుంది. పల్లెటూర్లలో అయితే ఎంతో అద్భుతంగా సంక్రాంతి పండుగ ఉంటుంది. రాను రాను సంక్రాంతి పండుగ శోభ తగ్గిపోతుంది. కానీ పల్లెటూర్లలో మాత్రం అదే కళ ఉంటుంది. చాలా మందికి నిజంగా సంక్రాంతి పండుగ అంటే ఏమిటో తెలియదు అందుకనే ఈ కథనాన్ని తీసుకువచ్చాము.

భోగి పండుగ:

సంక్రాంతి ముందు రోజు భోగి పండుగ వస్తుంది అయితే ఈరోజు చలి ఎక్కువగా ఉంటుంది అందుకని ఆ చలి నుండి బయటకు రావడానికి భోగి మంటల్ని వేస్తారు. చిన్నారులకి భోగి పండాలని పోస్తారు. భోగి పండ్లని పోసే రోజున హరిదాసుని పసి బాలుడుగా మార్చి దేవతలందరూ కలిపి రేగు పండ్ల తో అభిషేకం చేస్తారు. ఇలా కాలక్రమేనా భోగి పళ్ళు పోయడం ఆనవాయితీగా మారింది. భోగి పండ్లను పోస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారు.

సంక్రాంతి పండుగ:

ఈసారి సంక్రాంతి జనవరి 15న వచ్చింది. దక్షిణయాన్ని పూర్తి చేసుకొని ఈరోజు ఉత్తరాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క శక్తి మేరకు దాన ధర్మాలను చేస్తారు. సంక్రాంతి రోజు బొమ్మల నోము సావిత్రి గౌరీ వ్రతం వంటివి చేస్తారు. అలానే పూర్వీకుల ఆత్మ శాంతి కోసం దానాలను చేస్తారు.

గాలిపటాల పండుగ:

కృష్ణ, గుంటూరు, తూర్పు, గోదావరి, పశ్చిమ గోదావరి ప్రాంతాలలో కోడి పందాలని నిర్వహిస్తారు. అలానే హైదరాబాదులో కొన్ని ప్రాంతాలలో గాలిపటాల పండుగని చేసుకుంటారు. గాలిపటాల పండుగని గుజరాత్ లో అంగరంగ వైభవంగా జరుపుతారు.

కనుమ పండుగ:

మూడవ రోజు కనుమ పండుగ. కనుమ రోజు పశువులని అందంగా అలంకరిస్తారు. ఆ తర్వాత వాళ్ళ శక్తి మేరకి దానాలు చేస్తారు.

ముక్కనుమ:

నాలుగో రోజే ముక్కనుమ. ఈ రోజు మాంసాహారాన్ని అందరూ తీసుకుంటారు. ముక్కనుమ శోభ పల్లెటూర్లలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఇలా నాలుగు రోజులు కూడా అందరూ సంతోషంగా సరదాల సంక్రాంతిని జరుపుకుని తిరిగి మళ్ళీ వారి ప్రాంతానికి వెళ్లిపోతారు.

Read more RELATED
Recommended to you

Latest news