ఉగాది రోజున ఈ వస్తువులను ఇంటికి తీసుకెళ్తే.. మీకు పట్టిందల్లా బంగారమే..

-

హిందువులకు ఉగాది పండుగనే కొత్త సంవత్సరంగా భావిస్తారు.. ‘విక్రమ సంవత్ 2023’ మార్చి 22 బుధవారం నుంచి ప్రారంభం కానుంది. చైత్ర మాసం శుక్ల పక్షం ప్రతిపద తిథి నాడు బ్రహ్మ దేవుడు విశ్వాన్ని సృష్టించాడని చెబుతారు.. అందుకే ఆ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటారు.ఈ ఉగాదికి ప్రారంభానికి ముందు హిందువులు ఇంటికి కొన్ని శుభ వస్తువులు తీసుకువస్తే చాలా మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అవి ఎన్నో శుభాలను అందిస్తాయని చెబుతున్నారు. ఇంతకీ ఆ శుభ వస్తువులు ఏమిటి? వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

*. ఉగాది సందర్భంగా తులసి మొక్కను ఇంటికి తీసుకు రావచ్చు. ఇంట్లో ఏదైనా ఇండోర్ ప్లాంట్‌ను నాటడం శుభ పరిణామంగా పరిగణించ బడుతుంది. ఈ మొక్క ఇంట్లో ఉంటే చాలా శుభప్రదంగా భావిస్తారు.

*. ఒక చిన్న కొబ్బరికాయను ఇంటికి తీసుకురండి. ఈ కొబ్బరికాయను డబ్బులు ఉంచే బీరువాలో పెట్టండి. ఫలితంగా మీ ఇంట్లోని సంపద, ఐశ్వర్యం చెక్కుచెదరవు..

*. లోహపు తాబేలును కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. వాస్తు శాస్త్రంలో.. తాబేలును ఆనందం , శ్రేయస్సుల చిహ్నంగా పరిగణిస్తారు. ఇత్తడి, కాంస్యం లేదా వెండితో చేసిన తాబేలును హిందూ నూతన సంవత్సరం ప్రారంభమయ్యే ముందు కొనొచ్చు.. ఇంట్లో తాబేలు ఉంటే ఖర్చులు తగ్గుతాయి..

*. ముత్యపు శంఖాన్ని ఇంట్లో ఉంచడం వల్ల సుఖ సంతోషాలు కలుగుతాయి. ధనానికి లోటు ఉండదు. అటువంటి పరిస్థితిలో కొత్త సంవత్సరానికి ముత్యాల శంఖాన్ని కొని ఇంటికి తీసుకొని రండి. దానిని పూజించిన తరువాత.. డబ్బులు ఉంచే బీరువాలో దాన్ని పెట్టండి.. మీ అదృష్టానికి నాంది.. పట్టిందల్లా బంగారమే..

*. అదే విధంగా లోహంతో చేసిన ఏనుగు బొమ్మను కొని ఇంటికి తీసుకురావచ్చు. ఇది సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది. దుష్ట శక్తులను నాశనం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో ఈసారి కొత్త సంవత్సరానికి ఘనమైన వెండి లోహంతో చేసిన ఏనుగు విగ్రహాన్ని కొనుగోలు చేయండి. దీన్ని ఇంట్లో ఉంచడం వల్ల శాంతి, ఆనందం, శ్రేయస్సు చేకూరుతాయి..

*. ఉగాది తొలిరోజున ఇంటికీ లాఫింగ్ బుద్ధను కూడా తీసుకురావచ్చు. దీన్ని ఎల్లప్పుడూ ఇంటి ఈశాన్య దిశలో ఉంచండి. లాఫింగ్ బుద్ధను ఇంట్లో పెట్టుకోవడం వల్ల డబ్బుకు ఎప్పుడూ లోటు ఉండదు.. ఇది గుర్తుపెట్టుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news