దీపావళి నాడు దీపాలను పెట్టేటప్పుడు ఇవి ముఖ్యం పాటించండి..!

-

దీపావళి.. లక్ష్మీప్రదమైన పండుగగా పేరు దీనికి. ముఖ్యంగా వ్యాపార వర్గాల వారు పెద్ద ఎత్తున దీన్ని జరుపుకొంటారు. ఈ పండుగ మతభేదాలు లేకుండా జరుపుకుంటారు. ఈ రోజున శ్రీ మహాలక్ష్మీ పూజ చేసి రాక్షసుల బాధలు తొలగిన ఆనందాన్ని వ్యక్తపరచుటకై దీపాలంకరాలు చేసి టపాసులు కాలుస్తారు.

Rituals during Deepavali

అసలు దీపావళి అంటే దీపాల పండుగ అని పేరు ఎలా వచ్చింది..? ఎప్పటి నుండో మనం దీపావళి పండుగను చేసుకుంటున్నాము. భారతదేశంలో జరుపుకునే పండుగలలో దీపావళి కూడా ఒకటి. అయితే చాలా మందికి దీని అర్ధం ఏమిటి అనేది తెలీదు. దీపావళి అంటే దీపముల వరస అని అర్ధం. అందుకే ఈ పేరు వచ్చింది.

అయితే దీపావళి నాడు ఖచ్చితంగా దీపాలని అందరూ వెలిగిస్తూ వుంటారు కాని దీపావళి నాడు దీపాలని పెట్టేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి వాటిని చూసి అనుసరించండి.

దీపావళి రోజు అమ్మ వారి ఆశీస్సులు పొందాలన్నా ఆర్థికంగా శ్రేయస్సు పొందాలన్నా దీపాలను అలంకరించడం చాలా ముఖ్యం.
దీపాలను అలంకరించడం అప్పుడు కచ్చితంగా మట్టి దీపాలను ఉపయోగించండి. మట్టి దీపాలతో ఇంటిని అలంకరించడం చాలా మంచిది ఇది ఆర్థిక పురోగతిని వేగంగా మారుస్తుంది.
దీపావళి నాడు దీపాలు పెట్టేటప్పుడు ఇంటి ఉత్తరం వైపు కచ్చితంగా మట్టి దీపం పెట్టండి ఐశ్వర్యాన్ని తీసుకువస్తుంది. ఉత్తరం వైపు దీపం పెడితే చక్కటి ఫలితాలు వస్తాయి.
లక్ష్మీదేవి ముందు ఒక దీపం వెలిగించండి అలానే తులసి కోట ముందు ఒక దీపాన్ని పెట్టండి. ఇవి కూడా చాలా మంచి చేస్తాయి.
దీపాలు వెలిగించే టప్పుడు పూజ గదిలో దీపాన్ని పెట్టడం మాత్రం మర్చిపోకండి.
చాలామంది గుండ్రంగా ఉండే దీపాలను మాత్రమే వెలిగించాలని అంటారు కానీ పొడుగ్గా ఉండే దీపాలను వెలిగించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news