జూఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లో ఆ సత్తా వుందా..!!

-

ఆర్ఆర్ఆర్ సినిమాతో  దర్శక ధీరుడు రాజమౌళి మరోసారి తన దర్శక ప్రతిభతో తెలుగు సినిమా ను ప్రపంచ స్థాయిలో నిలిపాడు. ఈ సినిమా ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల స్క్రీనింగ్ అయ్యి ఇతర దేశాల ప్రేక్షకులను అబ్బుర పరిచింది. ఈ సినిమా వల్ల రాజమౌళికి విపరీతంగా ప్రచారం వచ్చింది. తాను ఇప్పటికే అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్ లో పాల్గొంటూ , అక్కడి మీడియాతో ఇంటర్వ్యూ లో పాల్గొంటున్నారు. 

రాజమౌళి వల్ల బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారి పోయాడు. కాని ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లకు కూడా అలాంటి ఫాలోయింగ్ వస్తుందా, రాదా అని సోషల్ మీడియాలో చర్చించు కుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత విడుదల అయిన రామ్ చరణ్, చిరంజీవి సినిమా ఆచార్య ప్లాప్ అయ్యింది. దీంతో అతని స్టార్ ఇమేజ్ మీద అనుమానాలు కలిగాయి. కొంత మంది అది కథ ప్రాబ్లం వల్ల కాని అతని నటన బాగానే ఉందని అన్నారు.

ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో RC15 సినిమా చేస్తున్నాడు. శంకర్ అంటే ఫాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ వుంటుంది కాబట్టి ఈ సినిమా పై అంచనాలు నెలకొన్నాయి. మరో వైపు జూ ఎన్టీఆర్ కొరటాల శివ తో NTR 30 సినిమా చేస్తున్నాడు. చాలా రోజుల నుండి ఈ  సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఇంకా సైట్స్ పైకి అడుగు పెట్టలేదు. ఇప్పుడు ఈ సినిమాలతో జూ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లకు ఆర్ఆర్ఆర్ సినిమా వల్ల వచ్చిన క్రేజ్ ప్లస్ పాయింట్ అవుతుందా లేదా అని తెలిసిపోతుంది. ప్రస్తుతం ఇద్దరు హీరోలు జపాన్ దేశంలోలో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ కోసం పర్యటిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news