నవరాత్రుల్లో కన్యా పూజా విశిష్టతలు..నియమాలు..

-

ఆశ్వయుజ మాసంలో వచ్చే శారదీయ నవరాత్రుల్లో శక్తి ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. నవరాత్రులు తొమ్మిది రోజుల్లో దుర్గాదేవిని తొమ్మిది రూపాలుగా తయారుచేసి ప్రత్యేక పూజలను చేస్తారు.నవరాత్రులలో అమ్మవారి స్వరూపంగా భావిస్తూ.. తొమ్మిది రోజులు ఒకొక్క బాలికను కొందరు పూజిస్తారు. మరికొందరు నవరాత్రుల ముగింపు రోజున అష్టమి లేదా నవమి నాడు తమ ఇంట్లో 9 మంది అమ్మాయిలను పిలిచి పూజిస్తారు. ఈ సంవత్సరం అష్టమి 3 అక్టోబర్ 2022 న వచ్చింది. నవమి తేదీ 4 అక్టోబర్ 2022 న వచ్చింది. నవరాత్రుల్లో ఏ వయసులో ఉన్న అమ్మాయిని పూజిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

నవరాత్రులలో పూజించబడే తొమ్మిది మంది బాలికల్లో రెండేళ్ల బాలిక కుమారి, మూడేళ్ల బాలిక.. త్రిమూర్తి, నాలుగేళ్ల బాలిక .. కళ్యాణి, ఐదేళ్ల బాలిక.. రోహిణి, ఆరేళ్ల బాలిక.. కాళిక, ఏడేళ్ల బాలిక.. చండిక, ఎనిమిదేళ్ల బాలిక .. శాంభవి, తొమ్మిదేళ్ల బాలికను దుర్గగా, పదేళ్ల బాలికను సుభద్రగా పరిగణిస్తారు..చిన్న పిల్లలను పూజిస్తే దరిద్రాలు అన్నీ పొతాయని నమ్ముతారు..

ఈ పూజకు పాటించాల్సిన నియమాలు..

*. కన్యా పూజ కోసం అమ్మాయిలను సగౌరవంగా మీ ఇంటికి ఆహ్వానించండి .. వారిని గౌరవంగా పంపించండి.
*. కన్యా పూజ కోసం 02 నుండి 10 సంవత్సరాల వయస్సు గల బాలికలను ఆహ్వానించాలి. 09 మంది బాలికలు ఉండాలి.
*.నవరాత్రులలో ఆడపిల్లలతో పాటు చిన్న బాలుడిని కూడా తప్పనిసరిగా ఆహ్వానించాలి.. భైరవుని రూపంలో ఆ బాలుడిని భావించి.. బాలికలతో పాటు పూజించాలి.
*.మీరు మీ నమ్మకం ప్రకారం అష్టమి లేదా నవమి తిథి నాడు కన్యా పూజ చేయవచ్చు.
*. బాలికను పూజించే ముందు, ఆమె పాదాలను కడిగి, తుడిచి.. శుభ్రమైన ఆసనంపై కూర్చోబెట్టి, ఆచార పూజలు చేసి, ఆ తర్వాత ఆ బాలికకు ఖీర్, పాయసం, పూరీ మొదలైనవి తినడానికి ఇవ్వాలి.
*. బాలికలను పూజించిన తరువాత, అమ్మాయిలను విడిచిపెట్టేటప్పుడు బహుమతులు లేదా డబ్బులను ఇవ్వండి. అమ్మాయిలను తిరిగి పంపించే ముందు వారినుంచి ఆశీస్సులు తీసుకోవడం మర్చిపోవద్దు..ఈ నవరాత్రులకు ఇదే హైలెట్ అని చెప్పాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version