శ్రీరామనవమి రోజు పానకం అనేది మనకు సాంప్రదాయం. పానకం లేని ఇల్లు ఉండదు నవమి రోజు. పానకం తాగితే ఆ రోజు పుణ్యం అని భావించే వాళ్ళు కూడా ఉంటారు. అందుకే ఆ రోజు అందరూ కూడా పానకం తయారు చేసుకుంటారు. మరి పానకం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం.
కావలసిన పదార్థాలు :
బెల్లం – 3 కప్పులు
మిరియాల పొడి – 3 టీ స్పూన్లు,
ఉప్పు : చిటికెడు,
శొంఠిపొడి : టీ స్పూన్,
నిమ్మరసం : మూడు టీ స్పూన్లు,
యాలకుల పొడి : టీ స్పూన్
నీరు : 9 కప్పులు
తయారీ విధానం :
ముందు బెల్లాన్ని మెత్తగా కొట్టుకుని.. నీళ్ళలో కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగాక.. పలుచని క్లాత్‌లో వడకట్టాలి. ఇందులో మిరియాలపొడి, శొంఠి పొడి, ఉప్పు, యాలకల పొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలి. అంతే పానకం సిద్ధమైనట్లే.
వడపప్పు ఎలా చేయాలంటే..?
కావలసిన పదార్థాలు:
పెసరపప్పు – కప్పు,
కీరా – ఒక ముక్క,
పచ్చిమిర్చి – 1 (తరగాలి),
కొత్తిమీర తరుగు- టీ స్పూన్,
కొబ్బరి తురుము -టేబుల్ స్పూన్,
ఉప్పు – తగినంత
తయారీ విధానం: పెసరపప్పును నాలుగు గంటలు నీళ్లలో నానబెట్టాలి. నీటిని వడకట్టేసి, పప్పు ఒక గిన్నెలో వేయాలి. దాంట్లో కీరా తరుగు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొబ్బరి, ఉప్పు వేసి కలపితే వడపప్పు రెడీ.