ముద్దపప్పు బతుకమ్మ: మూడోరోజు బతుకమ్మ ప్రత్యేకతలు ఇవే!

-

బతుకమ్మ పండుగ రంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారు. ఇప్పటికే మొదటి రెండురోజులు ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకుల బతుకమ్మ వేడుకలు ముగిశాయి. సోమవారం మూడోరోజు. ఈ రోజు మూడంతరాలలో చామంతి, మందార, సీతమ్మజడ, రామబాణం పూలతో బతుకమ్మను చేసి.. తామర పాత్రల్లో అందంగా అలంకరిస్తారు.

బతుకమ్మ పండుగలో మూడోరోజు (సెప్టెంబర్‌ 30) ’ముద్దపప్పు బతుకమ్మ’గా బతుకమ్మను పూజిస్తారు.
మూడోరోజు వాయనం: సత్తుపిండి, పెసర్లు, చక్కర, బెల్లం
నైవేద్యాలు: ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారుచేసి సమర్పించాలి.
ఈరోజు బతుకమ్మను ఆరాధిస్తే ఆరోగ్యం, బోగభాగ్యాలు లభిస్తాయని విశ్వాసం.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version