రాత్రి భోజనం చేసాక… ఈ తప్పులు చెయ్యద్దు..!

-

తప్పులు చెయ్యద్దు: మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం మంచి ఆహారాన్ని తీసుకోవాలి. అలానే సరైన జీవన విధానాన్ని కూడా అనుసరిస్తూ ఉండాలి. చాలా మంది రాత్రి ఆహారం తిన్న తర్వాత పొరపాట్లను చేస్తూ ఉంటారు అటువంటి తప్పులు వలన ఆరోగ్యం పాడవుతుంది. 30 ఏళ్ల తర్వాత కచ్చితంగా ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి లేకపోతే అనవసరంగా రకరకాల సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే రాత్రి భోజనం చేశాక ఏం చేయకూడదు.. ఏం చేయాలి ఎటువంటి తప్పులు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

రాత్రి భోజనం చేసిన తర్వాత వెంటనే విశ్రాంతి తీసుకోకండి. చాలా మంది తినేసిన వెంటనే నిద్ర పోవాలని అనుకుంటారు కానీ అలా చేయడం వలన గుండెలో మంట ఆసిడ్ రీప్లక్స్ వంటివి కలుగుతాయి.
భోజనం చేసిన తర్వాత స్నాక్స్ ని కానీ స్వీట్ లని కానీ హెవీగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోకండి. రాత్రిపూట ఇలా తీసుకోవడం వలన అజీర్తి సమస్యలు బరువు పెరిగిపోవడం వంటి ఇబ్బందులు కలుగుతాయి.
రాత్రి ఆహారం తీసుకున్న తర్వాత ఆల్కహాల్ ని తీసుకోవడం కూడా మంచిది కాదు ఆల్కహాల్ ని తీసుకుంటే కూడా అజీర్తి సమస్యలు ఎక్కువవుతాయి.
రాత్రిపూట ఆహారం తిన్నాక ఫిజికల్ యాక్టివిటీ వ్యాయామం చేయడం వలన అజీర్తి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
తిన్న తర్వాత స్నానం చేయడం కూడా మంచిది కాదు ఇది కూడా జీర్ణ సమస్యలను తీసుకొస్తుంది. ఉదర సంబంధిత సమస్యలు ఎక్కువవుతాయి.
శారీరిక ఆక్టివిటీలు కానీ మానసిక ఆక్టివిటీలు కానీ తిన్న తర్వాత చేయకూడదు రెండు రెండు మూడు గంటల గ్యాప్ ఇవ్వాలి అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. ఈ తప్పులను చేయకుండా చూసుకోండి. చాలా మంది తప్పులని చేసి రకరకాల బాధలు పడుతూ ఉంటారు కానీ ఈ తప్పుల్ని చేయడం వలన మీరే ఇబ్బందిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news