హోలీ స్పెషల్: ఆపిల్ జిలేబీని ఇలా ఈజీగా చేసేయండి..!

Join Our Community
follow manalokam on social media

ఆపిల్ జిలేబి టేస్ట్ చాలా బాగుంటుంది. పైగా ఇంట్లో చేయడం కూడా ఈజీనే. ముందుగా కాస్త ప్రిపరేషన్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది. మీ ఇంట్లో హోలీ సందర్భంగా ఆపిల్ జిలేబి ని ఈ విధంగా చేసుకుని ఇంటిల్లిపాది ఆనందంగా తినండి. ఆపిల్ జిలేబిని పెద్దలు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అయితే హోలీ స్పెషల్ ఆపిల్ జిలేబి తయారు చేసుకునే విధానం ఇప్పుడే చూసేయండి.

ఆపిల్ జిలేబి కి కావలసిన పదార్థాలు:

ఆపిల్ 1, పంచదార 300 గ్రాములు, కుంకుమ పువ్వు ఒక గ్రాము, నెయ్యి 500 గ్రాములు,
పాలు 250 మిల్లీ లీటర్లు, పెరుగు 100 గ్రాములు మరియు మైదా 200 గ్రాములు.

ఆపిల్ జిలేబిని తయారు చేసుకునే విధానం:

ఆపిల్ జిలేబిని తయారు చేయడానికి ముందు పెరుగుని మైదా పిండి లో వేసి నానా బెట్టాలి. ఆ తరువాత 24 గంటల వరకు అలానే వదిలేయాలి. ఇప్పుడు పంచదార తీసుకుని సిరప్ లాగ చేయండి. ఆ తర్వాత దీనిలో పాలు కూడా పోసి అలా ఉంచేయండి.

ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దానిలో నెయ్యి వేసి మరిగించండి. దానిలో కట్ చేసిన యాపిల్ ముక్కల్ని పిండి లో ముంచి వేయించండి. వాటిని పక్కన పెట్టి షుగర్ సిరప్ లో వెయ్యండి. అంతే ఇక యాపిల్ జిలేబి రెడీ అయిపొయింది. సర్వ్ చేసేసుకోవడమే.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...