బిగ్ బ్రేకింగ్ : బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే కన్నుమూత

ఏపీలో అధికార పార్టీ వైసీపీ లో విషాదం చోటు చేసుకుంది. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే డా.వెంకట సుబ్బయ్య కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మొన్నటి దాకా హైదరాబాద్‌ లో ఉండి అక్కడే హాస్పిటల్ లో చికిత్స పొందారు. కాస్త ఆరోగ్యం కుదుట పడడంతో కడపలోని తన నివాసానికి చేరుకున్నారు.

ఆ తర్వాత మొన్న జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా ఆయన చురుగ్గా పాల్గొన్నారు. అయితే ఎన్నికల అనంతరం మళ్లీ అనారోగ్యం బారిన పడిన ఎమ్మెల్యే కడప లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్రుత్తి రీత్యా డాక్టర్ అయిన ఆయన 2016లో వైసీపీలో చేరారు. 2019లో ఆయనకు టికెట్ ఇవ్వడంతో ఆయన గెలుపొందారు. ఇక ఎమ్మెల్యే మృతితో వైసీపీలో విషాదం నెలకొంది.