ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ లాగించేస్తున్నారా..? డిప్రషన్‌లోకి వెళ్తారు జాగ్రత్త..!

-

French fries: అసలు ఈరోజుల్లో.. పిజ్జా, బర్గర్లు, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ తినని వాళ్లు అంటూ ఉండరేమో కదా..! చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ల వరకూ అందరూ వీటిని ఇష్టంగా తింటారు. ఎంత వద్దు వద్దు అనుకున్నా.. వాటిని చూస్తే ఆగలేరు. సినిమాలు చూస్తూ.. ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ తింటుంటే ఆ మజానే వేరు. యువతకు జంక్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఒక స్టేజ్‌లో వాటికి బానిసలుగా మారిపోతున్నారు. వీటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కంటే కలిగే హాని ఎక్కువగా ఉంటుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం వల్ల డిప్రెషన్ లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజా పరిశోధన వెలుగులోకి వచ్చింది.

 

french fries
french fries

చైనాలోని హాంగ్ జౌ పరిశోధకుల వెల్లడించిన దాని ప్రకారం.. వేయించిన బంగాళాదుంపలు తరచుగా తీసుకోవడం వల్ల డిప్రెషన్, యాంగ్జయిటీ రిస్క్ 7%,12% పెరుగుతున్నాయని తేలింది. ఫ్రై చేయని ఆహారం తీసుకోని వ్యక్తులతో పోలిస్తే ఫ్రెంచ్ ఫ్రైస్ అధికంగా తీసుకునే వారిలో డిప్రెషన్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పరిశోధకులు వెల్లడించారు.. యువకులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు.

వేయించిన ఆహారం మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

డీప్ ఫ్రై చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల రక్తపోటు, ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్‌తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. మానసిక ఆరోగ్య సమస్యలు, వేయించిన ఆహార పదార్థాల మధ్య సంబంధాన్ని ఏర్పరచడంలో నిర్ణయాత్మకంగా ఉండకపోవచ్చని పరిశోధకులు తెలిపారు.

అధ్యయనం ఎలా సాగిందంటే..

ఈ అధ్యయనం దాదాపు 11 సంవత్సరాలకు పైగా సాగింది. సుమారు 1,40,728 మంది వ్యక్తులు ఇందులో పాల్గొన్నారు. మొదటి రెండేళ్లలో డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తులను మినహాయించారు. మిగతా వారికి వేయించిన ఆహారాన్ని, ప్రత్యేకంగా వేయించిన బంగాళాదుంపలను తినే 8294 మంది వ్యక్తులలో యాంగ్జయిటీ, 12,375 డిప్రెషన్ కేసులు గుర్తించారు.

ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకోవడం వల్ల డిప్రెషన్ ప్రమాదాన్ని మరో 2 శాతం పెంచింది. ఇది ఎక్కువగా యువకుల్లో కనిపించింది. ఆందోళన, నిరాశతో బాధపడుతున్న వ్యక్తులు తమ మూడ్ మార్చుకునేందుకు తరచుగా ఆహారం వైపు మొగ్గు చూపుతారట.. ఈ అనారోగ్య ఎంపికలు అతిగా తీసుకోవడం వల్ల మానసిక కల్లోలం, డిప్రెషన్, మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు వంటి జీవక్రియ రుగ్మతలకు దారి తీస్తుంది.

ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా తింటే ఆరోగ్యమే

బంగాళాదుంపలతో కాకుండా క్యారెట్, స్వీట్ పొటాటోతో చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుంటే.. ఇవి ఆరోగ్యానికి మంచివి.. పైగా ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ రావు.. అయితే వాటిని నూనెలో వేయించుకోవడం కాకుండా ఆవిరితో ఉడికించుకోవాలి. శరీరానికి కావాల్సిన పోషకాలను చిలగడదుంప అందిస్తుంది. బరువు తగ్గడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి.. ఫైబర్, విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లతో నిండిన ఫుడ్ ఇది. షుగర్‌ ఉన్నవాళ్లు కూడా ఇవి తినొచ్చు.!

Read more RELATED
Recommended to you

Latest news