పిండి వంట‌ల‌ను బెల్లంతోనే ఎందుకు చేస్తారో తెలుసా..!

-

పంగ వ‌స్తుందంటే చాలు పూజ‌లు, పిండివంట‌లే గుర్తుకువ‌స్తాయి. పూజ‌ల సంగ‌తి ఎలా ఉన్నా.. పిండివంట‌ల విష‌యానికి వ‌చ్చే స‌రికి అనేక ర‌కాలు చేస్తుంటారు. అయితే పిండివంట‌ల‌తో కూడా ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. ముఖ్యంగా బెల్లంతో పిండివంట‌లు ఎక్కువ‌గా చేస్తారు. మ‌రి బెల్లంతోనే ఎందుకు పిండివంట‌లు చేస్తారో తెలుసా ? అయితే దాని వెన‌క ఉన్న విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..

బెల్లం ఒక తియ్యని ఆహార పదార్ధము. దీనిని సాధారణంగా చెరకు రసం నుండి తయారుచేస్తారు. బెల్లపు రుచికి, క్షారగుణానికీ జీర్ణరసాలు ఎక్కువగా ఊరతాయి. వీటి వల్ల అంతకుముందు తీసుకున్న ఆహారం కూడా సులభంగా జీర్ణమైపోతుంది. అందుకనే భుక్తాయాసంగా ఉన్నప్పుడు ఒక పలుకు బెల్లం తినమని చెబుతూ ఉంటారు పెద్దలు.

పంచదార కంటే బెల్లం ఆరోగ్యపరంగా శ్రేష్టం. ఎందుకంటే బెల్లంలో ఇనుము మొదలైన మూలకాలు ఉంటాయి. భారతీయ వంటలలో బెల్లం ఒక ముఖ్యమైన భాగం. తియ్యని పిండివంటలు తయారీలో కొంతమంది పంచదార కంటే బెల్లాన్నే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆయుర్వేద వైద్యశాస్త్రంలో కూడా బెల్లాన్ని చాలా రకాల మందులలో వాడతారు. బెల్లంలో ఉండే ఐరన్‌ వల్ల రక్తహీనత సమస్య దూరమైపోతుంది. అందుకనే గర్భిణీ స్త్రీలనీ, బాలింతలనీ బెల్లం తినమని చెబుతుంటారు.

బెల్లపు నీరు వల్ల ఒంట్లోని ఉష్ణోగ్రతలు అదుపు తప్పకుండా ఉంటాయట. వేసవిలో బెల్లంతో చేసిన పానకంతో కడుపు చల్లగా ఉంటుంది. కాలేయం వంటి అవయవాన్ని కూడా శుద్ధి చేసే ప్రభావం బెల్లానికి ఉంది. మ‌రియు కీళ్ల సమస్యలకి ఉపశమనం క‌లిగిస్తుంది. అందుకే శ‌రీరానికి ఎంతో ఉప‌యోగ‌ప‌డే బెల్లాన్ని పిండివంట‌ల‌కు ప్రాచీన కాలం నుండి ఉపయోగిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news