కే విశ్వనాద్ ని కలిసిన చిరంజీవి.. తీవ్ర విమర్శలు !

ఈరోజు దీపావళి సందర్భంగా కళాతపస్వి కె.విశ్వనాథ్ నివాసానికి వెళ్లారు మెగాస్టార్‌ దంపతులు. విశ్వనాథ్ దంపతులకు నూతన వస్త్రాలు సమర్పించారు. ఇండస్ట్రీలో ఇప్పుడు పెద్ద స్థాయిలో ఉన్న తన శిష్యుడు తన ఇంటికి రావడంతో విశ్వనాథ్ కూడా సరదాగా గడిపారు. కాసేపు ఇద్దరూ తమ మధుర జ్ఞాపకాలను, అప్పటి సినిమా విశేషాలను గుర్తుచేసుకున్నారు. మెగాస్టార్ విశ్వనాథ్ ఆరోగ్య క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా తనకు పాదాభివందనం చేసిన చిరంజీవిని కె.విశ్వనాథ్ ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తనకు కరోనా అని వెల్లడించడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. అయితే తప్పుడు కరోనా కిట్ వల్ల పాజిటివ్ అని వచ్చిందని చిరు స్వయంగా చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఎనభై ఏళ్ళ వయసున్న ఆయన్ని కలిసి వాటేసుకోవడంతో చిరంజీవి మీద నెటిజన్లు మండి పడుతున్నారు. ఒకవేళ ఆయనకు ఏమయినా అయితే నీదే బాధ్యత అని అంటున్నారు.