మీకు దంత సమస్యలు ఉన్నాయా? ఐతే నువ్వులు తినండి…

-

పొద్దున్న లేవగానే ఖాళీ కడుపుతో తినాల్సిన వాటి గురించి పెద్ద లిస్టే ఉంది. ఆ లిస్టు లో నుండి మనకేదీ అవసరమో గుర్తిస్తే సరిపోతుంది. ఐతే పొద్దు పొద్దున్న తినేవాటిలో నువ్వులని చేర్చుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు. మన శరీర జీవక్రియని పెంచడంతో పాటు ఎముకలకి కావాల్సిన బలాన్ని అందిస్తుందని తెలుపుతున్నారు. అంతే కాదు జీర్ణ సంబంధ వ్యాధులని పోగొడుతుందని దంతాలు, చిగుళ్ళ సమస్యలని సమూలంగా దూరం చేస్తుందని అంటున్నారు.

అవి తెల్ల నువ్వులైనా, నల్ల నువ్వులైనా ఆరోగ్యానికి మంచివే అని ఆయుర్వేద నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. నోరు ఆరోగ్యంగా ఉండడం అనేది శరీరం ఆరోగ్యంగా ఉందని చెప్పడానికి సంకేతం. మన శరీరంలో ఏమైనా మార్పులు ఏర్పడితే అది నోటి ద్వారా బయటకి తెలుస్తుంది. అందుకే నోటిని శుభ్రంగా ఉంచుకోవడం మర్చిపోవద్దు. నువ్వులని పొద్దున్న ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల దంత సమస్యలు తగ్గి చిగుళ్ళు బలపడతాయి.

ఇందులో ఉండే కాల్షియం దంతాలని బలంగా తయారు చేస్తుంది. పొద్దున్న పూట నువ్వులని తిన్న తర్వాత బ్రష్ చేసుకోవడం మంచిది. అది కూడా సాఫ్ట్ బ్రష్ తో టూత్ పేస్ట్ లేకుండా చేసుకోవాలి. వేయించిన నువ్వులు తినడానికి బాగుంటాయి. కేవలం దంతాల సమస్యలే కాదు కాలేయం సంబంధిత ఏదైనా ఇబ్బందులు ఉంటే నువ్వులు తినడం వల్ల దూరమవుతాయి.

పెద్దవారిలో మలబద్దకం తగ్గిపోతుంది. జుట్టు రాలిపోవడం మొదలగు సమస్యలని నువ్వులు దూరం చేస్తాయి. ఎముకలకి బలాన్ని చేకూర్చి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే ప్రతిరోజూ వేయించిన నువ్వులని ఆహారంగా తీసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news